విశాఖపట్నంలోని గాజువాకలో టీడీపీ శంఖారావం బహిరంగ సభ( TDP Shankaravam Meeting ) జరిగింది.ఈ సభలో పాల్గొన్న ఆ పార్టీ నేత నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.అన్ని చార్జీలను సీఎం జగన్ పెంచుతున్నారని పేర్కొన్నారు.వైసీపీ పాలనలో మొత్తం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు, మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచారని తెలిపారు.వంద సంక్షేమ కార్యక్రమాలను కట్ చేసిన ఘనత సీఎం జగన్( CM YS Jagan )ది అని విమర్శించారు.ఇంటింటికి వచ్చి వాలంటీర్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
టీడీపీ( TDP ) అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తారని చెబుతున్నారన్నారు.దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు.
ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.







