ఈరోజు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థి తల్లి అకౌంట్లో 15 వేల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది.అర్హులైన విద్యార్థుల తల్లి అకౌంట్ లో డబ్బులు జమ చేశారు.
అయితే అమ్మ ఒడి పథకం కింద నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణ అకౌంట్ లో కూడా 15 వేల రూపాయలు జమ అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.అంతేకాకుండా నారా దేవాన్ష్ చదువుల నిమిత్తం ఈ డబ్బులు అందాయంటూ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఇది నిజమని అంతా భావించారు.
ఇది బాగా వైరల్ కావడంతో ఈ విషయంపై నారా లోకేష్ స్పందించారు.
అది ఫేక్ ఫోటో అని ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.అమ్మఒడి అని బొమ్మ చూపించారు.బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆరువేల కోట్లు పక్కదారి పట్టించారు, ప్రతి బిడ్డకి అమ్మ ఒడి అన్నారు, ఇప్పుడు ఇంట్లో ఒకరికి అంటున్నారు .వైసీపీ పేటియం బ్యాచ్ సైలెంట్ గా ఉంటే మంచిది.తప్పుడు పనులు చేస్తే జగన్ గారి దొంగ బతుకు గుడ్డలూడదీసి రోడ్డు మీద నిలబెడతా అంటూ నారా లోకేష్ ఘాటుగా సోషల్ మీడియాలో స్పందించారు.