టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నది వెల్ నెస్ సెంటర్ లో కాదని జైల్లో ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి తెలిపారు.ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారం కేవలం సానుభూతి కోసమేనని విమర్శించారు.
దొంగతనం చేసిన వాళ్లు ఒక్కసారితో నిజం చెప్పరని మంత్రి గుడివాడ అన్నారు.సీఐడీ ప్రశ్నలు అమరావతి భూముల స్కాం చుట్టూనే ఉంటాయన్న మంత్రి గుడివాడ లోకేశ్ కుటుంబ యోగక్షేమాల గురించి కాదని పేర్కొన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో లోకేశ్ కి శిక్ష పడటం ఖాయమని తెలిపారు.







