ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల (AP Elections) కు రంగం సిద్ధమవుతోంది.ఇప్పటికే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా రాబోయే ఎన్నికల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటిపై ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు.
అంతేకాకుండా వైసిపి ప్రభుత్వం ఎక్కడైతే ఎమ్మెల్యే అభ్యర్థిపై వ్యతిరేకత ఉందో అక్కడ అభ్యర్థులను సైతం మార్చేస్తున్నారు.ఇక అధికారం లో ఉన్న జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ని ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటిని కలుపుకుంటూ వెళ్తున్నారు.
ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.అంతేకాకుండా బీజేపీని, కాంగ్రెస్ ని కూడా తమతో కలవాలని, తమకు మద్దతు ఇవ్వాలని రహస్య మంతనాలు చేస్తుతున్నారు.
ఇక ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కొడుకు లోకేష్ ఓటమి భయంతోనే ఆ పని చేస్తున్నారు అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మరి ఇంతకీ లోకేష్ ఓటమి భయంతో ఏ పని చేస్తున్నారు అంటే.లోకేష్ ఈసారి మంగళగిరి తో పాటు మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారట.ఈ విషయంలో పవన్ కళ్యాణ్ బాటలోనే లోకేష్ వెళ్తున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం తో పాటు గాజువాకలో కూడా పోటీ చేశారు.
అయితే ఈ రెండు చోట్ల కూడా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓడిపోయారు.ఇక పవన్ కళ్యాణ్ లాగే లోకేష్ కూడా ఈసారి ఎన్నికల్లో మంగళగిరి తో పాటు మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తానని టిడిపి పార్టీ అధిష్టానంతో చెప్పారట.ఇక లోకేష్ నిర్ణయాన్ని టిడిపి అధిష్టానం కూడా అంగీకరించడంతో వచ్చే ఎన్నికల్లో లోకేష్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈసారి భీమవరం తో పాటు గాజువాక కాకుండా మరో నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని సమాచారం.అయితే ఈ విషయం తెలిసిన కొంతమంది వైసిపి అభిమానులు లోకేష్ (Nara Lokesh) ఓటమి భయంతోనే అలా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు అంటూ స్పందిస్తున్నారు