మంగళగిరి పట్టణం 22 వ వార్డు రత్నాలచెరువు ప్రాంతంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.భావనాఋషి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేష్.
పోలియోతో బాధపడుతున్న తన మూడో కూతురుకు వీల్ చైర్ సాయం చేయాలని కోరిన రాజేశ్వరి కుటుంబం.వెంటనే అంగీకరించి వీల్ చైర్ అందిస్తానని చెప్పిన లోకేష్.
ఇంటింటికి తిరుగుతూ బాదుడే బాదుడు కరపత్రం అందజేస్తున్న లోకేష్.వైసిపి పాలన లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్న లోకేష్.
నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, చెత్త పన్ను, ఇంటి పన్ను తో సహా అన్ని పెరిగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని లోకేష్ కి సమస్యలు వివరించిన ప్రజలు.
రూ.15 వేలు సంపాదించుకునే పేద, మధ్య తరగతి కుటుంబాలకు టిడిపి పాలనలో నెలకు రూ.4వేలు మిగులు ఉంటే, వైకాపా పాలనలో రూ.9వేలు లోటు ఉంటోందని వివరిస్తూ ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్న లోకేష్.నెలకు రూ.9వేలు చొప్పున ఏటా రూ.1,08,000 వైసిపి ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటుందన్న లోకేష్.2019 వరకు నెలకు రూ.11వేలు ఖర్చులకు సరిపోతే ఇప్పుడు రూ.20వెలవుతోందని ధ్వజం.నిత్యావసరాలు, ఇతర ధరలకు సంబంధించి టిడిపి-వైకాపా పాలనలో వ్యత్యాసాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ.
ఇటీవల మరణించిన, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న నారా లోకేష్ రత్నాల చెరువు ప్రాంతంలోని చేనేత మగ్గం షెడ్లను పరిశీలించిన నారా లోకేష్
వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న నేతన్నలను పరామర్శించి వారి ఇబ్బందులు తెలుసుకున్న లోకేష్ ప్రతి ఏడాది వర్షాకాలం మగ్గాల్లోకి నీరు రావడం వలన ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం అని లోకేష్ దృష్టికి తెచ్చిన నేతన్నలు.ముడిసరుకులైన నూలు, పట్టు, జర్రీ, రంగుల ఖర్చులు అధికమయాన్ని వాపోయిన నేతన్నలు.
నేతన్న నేస్తం కూడా కేవలం సొంత మగ్గాలు ఉన్న వారికే అందుతుంది.మాకు నేతన్న నేస్తం అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన నేతన్నలు.
ఉపాధి లేని సమయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదని సమస్యలు వివరించిన నేతన్నలు.







