తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పుస్వామి( Tamilnadu BJP Chief Annamalai Kuppusamy )కి మద్ధతుగా టీడీపీ నేత నారా లోకేశ్( TDP Nara Lokesh ) ఎన్నికల ప్రచారం చేయనున్నారు.కోయంబత్తూరు ఎంపీ స్థానం అన్నామలై బరిలో ఉన్నారన్న సంగతి తెలిసిందే.
ఎన్నికల ప్రచారంలో నేడు, రేపు కోయంబత్తూరు( Coimbatore )లో పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు.అదేవిధంగా రోడ్ షోలలో కూడా లోకేశ్ పాల్గొననున్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ రాత్రి ఏడు గంటలకు పీలమేడులో ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ప్రసంగించనున్నారు.అలాగే ఉదయం సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు.