తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.దాదాపు 20 రోజులకు పైగా చంద్రబాబు జైల్లో ఉండటంతో.
తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం నిరుత్సాహంలో ఉంది.ఇదే సమయంలో చంద్రబాబుకి బెయిల్ కోసం టీడీపీ లీగల్ టీం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది.
చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) అక్రమం అంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ క్రమంలో తాజాగా సెప్టెంబర్ 30వ తారీకు చంద్రబాబుకి మద్దతుగా “మోత మోగిద్దాం” అనే కొత్త నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తూ సోషల్ మీడియాలో నారా లోకేష్( Nara lokesh ) సంచలన పోస్ట్ పెట్టారు.
“అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం.తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం.
నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబు( Chandrababu naidu )కి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది.నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30 వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దాం”.అని లోకేష్ స్పష్టం చేయడం జరిగింది.