టిడిపి ప్రభుత్వం లో ఆర్టీసి ఛార్జీలు …వైసిపి పాలనలో ఆర్టీసి ఛార్జీల మధ్య వ్యత్యాసాన్ని ప్రయాణికులను అడిగి తెలుసుకున్న నారా లోకేష్.ఛార్జీలు పెంచి విపరీతంగా భారం పెంచారని లోకేష్ కి చెప్పిన ప్రయాణికులు.
ప్రభుత్వం లో విలీనం చేసిన తరువాత సిబ్బంది పడుతున్న ఇబ్బందులు గురించి కండక్టర్ ని అడిగి తెలుసుకున్న లోకేష్ వైసిపి ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి వారు ప్రయాణించే ఆర్టీసి ఛార్జీలను మూడు సార్లు పెంచింది.జగన్ బాదుడే బాదుడు కి ప్రజలపై విపరీతమైన భారం పెరిగింది.
పెంచిన ఆర్టీసి ఛార్జీలు తగ్గించాలి.ప్రభుత్వం లో విలీనం చేస్తే ఆర్టీసి కార్మికుల జీవితాలు మారిపోతాయి అన్నారు.
విలీనం చేసి గాలికి వదిలేశారు.విడిగా ఉన్నప్పుడు ఉన్న లబ్ది కూడా లేక ఆర్టీసి సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్టీసి సిబ్బందికి రావాల్సిన బెనిఫిట్స్ ఏమి ప్రభుత్వంలో విలీనం అయిన తరువాత దక్కలేదు.







