ఇప్పటికే ఏపీలో పొత్తు కొనసాగిస్తున్న టీడీపీ, జనసేనలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి.రెండు పార్టీలు కలిసి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ఉమ్మడిగా కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి.
ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో మరింత స్పీడ్ పెంచాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి.నిన్ననే టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నివాసానికి వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
సుదీర్ఘంగా ఈ ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా తాజా రాజకీయాలు, వైసిపిని ఎదుర్కొనేందుకు ఏ ఏ వ్యూహాలు అమలు చేయాలి ? ఏ విధంగా కలిసి ముందుకు వెళ్లాలి అనే విషయంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగిందట.సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించబోతున్నారు అనే అంశాలపై చంద్రబాబు( Nara Chandrababu Naidu )తో పవన్ చర్చించారట.జనసేనకు కేటాయించబోయే సీట్ల పైన చంద్రబాబును ఆరా తీశారట .ఈ సందర్భంగా రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించే అంశం పైన చర్చ జరిగినట్లు సమాచారం .ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఏఏ అంశాలు ప్రాధాన్యం ఇవ్వాలి ? మేనిఫెస్టో ప్రజల్లోకి విస్తృతంగా ఏ విధంగా తీసుకువెళ్లాలని దానిపైన చర్చించినట్లు తెలుస్తోంది ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి ? ఎవరెవరు హాజరవ్వాలి అనే వాటిపైన ఒక క్లారిటీ కి వచ్చారట.మరి కొద్ది రోజుల్లోనే భారీ బహిరంగ సభను టిడిపి, జనసేన కలిసి నిర్వహించాలని ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించాలని పవన్ చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వైసిపి( YCP ) విముక్త ఆంధ్ర ప్రదేశ్ కోసం కలిసి పని చేయాలని చంద్రబాబు పవన్ చర్చించారు.ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు .”సంస్థాగత నిర్ణయాలు భవిష్యత్తు ఎన్నికల వ్యూహం పై ఇద్దరు రెండున్నర గంటల పాటు చర్చించారు.ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి భవిష్యత్ సుపరిపాలన అందించడమే ప్రధాన లక్ష్యం ” అంటూ ఈ సమావేశంపై నాదెండ్ల మనోహర్ స్పందించారు.