స్కిల్ డెవలప్మెంట్ స్కాం( Skill Development Scam )లో ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ పై దేశవ్యాప్తంగా సానుభూతి కురుస్తుంది.ముఖ్యంగా రాష్ట్రాన్ని ఒక సరికొత్త విజన్ తో ముందుకు నడిపిన అలాంటి నేతను అరెస్టు చేయడం తగదంటూ అనేక రంగాల పెద్దలు వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే.
మరోపక్క చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) అక్రమం అంటూ హెరిటేజ్ లో తన వాటాలో కేవలం రెండు శాతం అమ్మితే 400 కోట్లు వస్తుందని అలాంటి మాకు ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశానికి కొత్త ఇబ్బందులు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది.

రెండు శాతం వాటా అమ్మితేనే 400 కోట్లు వచ్చినప్పుడు అసలు హెరిటేజ్ లో 40% వాటా కలిగి ఉన్న భువనేశ్వరి ఆస్తి విలువ ఎంత? అన్ని ఆస్తులు ఎలా సంపాదించారు ? వాటిలో ప్రభుత్వానికి ఏ స్థాయిలో పనులు కడుతున్నారంటూ కూపి లాగినట్టు తెలుస్తుంది .అంతేకాకుండా ఇప్పుడు లోకేష్ కు ఇచ్చిన 41 నోటీసుల్లో కూడా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన అనేక ఆర్థిక లావాదేవీలపై నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు( Inner Ring Road Scam ) అలైన్మెంట్లో మార్పుల వల్ల లింగమనేని రమేష్ సంస్థలతో పాటు హెరిటేజ్ సంస్థ కూడా భారీగా లాభపడిందని తమ అనునయులకు లబ్ది చేకూర్చేటందుకు అలైన్మెంట్ లో ఇష్టానుసారం మార్పులు చేశారని ఆ క్రమంలో అనేక ట్రాన్జక్షన్స్ అనుమానస్పదం గా జరిగినట్లుగా సిఐడి గుర్తించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఏది ఏమైనా సానుభూతిని పెంచే క్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి( Nara Bhuvaneswari ) నోరు జారినట్లుగానే తెలుస్తుంది.ఇప్పుడు ఈ వాఖ్యలు ప్రభుత్వానికి అతిపెద్ద అస్త్రంగా మారి తీగలాగితే తెలుగుదేశం మరింత ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది రాజకీయంగా ఆమెకు అంతగా అనుభవం లేకపోవడం భర్త అరెస్టుతో బ్యాలెన్స్ కోల్పోవడంతోనే ఆమె అలా మాట్లాడి అనవసరమైన ఇబ్బంది లో ఇరుక్కున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.