టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదివారం రాత్రి 7 గంటల నుండి 7.05 గంటల వరకు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.ఇందులో భాగంగా రాజమహేంద్రవరం( Rajamahendravaram )లోని విద్యానగర్ లోని క్యాంప్ సైట్ వద్ద నారా భువనేశ్వరి మహిళలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.
భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) తన చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు.
బాబుతో నేను, న్యాయానికి సంకెళ్లు అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అధర్మం నశించాలి, అన్యాయం నశించాలి అని నినాదాలు చేశారు.ఈ నిరసనలో మాజీ మంత్రులు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.