నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ రివ్యూ

కుమారి 21F చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది హెబా పటేల్.

ఇన్నిరోజులు గ్లామర్ పాత్రలతో సరిపెట్టుకున్న హెబా తొలిసారి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాతో మన ముందుకి వచ్చింది.

మరి నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమా ఎలా ఉందో చూద్దాం.కథలోకి వెళ్తే : రాఘవరావుకి (రావు రమేష్) పెళ్ళైన చాలాకాలానికి మొదటి సంతానంగా కూతురు పుడుతుంది.తనే పద్మావతి (హెబా పటేల్).

అయితే నాన్నకు వ్యతికేరకమైన దారిలో కూతురు వెళుతుంది అని పుట్టగానే పంతులు చెప్పడంతో, కూతురుకి తగ్గట్టుగానే తనని తాను మార్చుకుంటానని బాగా గారబం చేసి పెంచుకుంటాడు రాఘవరావు.పెద్దయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళిన పద్మావతి నాన్న తెచ్చిన సంబంధం ఇష్టం లేక తను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు, అమెరికాలో ఉంటున్న తన బాయ్ ఫ్రెండ్ నాలుగు నెలల్లో ఇండియా వస్తున్నట్లు అబద్ధం ఆడుతుంది.

ఈ గ్యాప్ లో నిజంగానే ఓ అబ్బాయితో ప్రేమలో పడాలని తననే ప్రేమికుడిగా నాన్నకి పరిచయం చేయాలనుకున్న పద్దు, ముగ్గురు అబ్బాయిలను ఎన్నుకోని వారిలో తనని బాగా ప్రేమించేవాడిని ఫైనల్ చేసుకోవాలనుకుంటుంది.కాని ఆ ముగ్గురు అబ్బాయిలు పద్మావతికి స్వచ్ఛమైన ప్రేమను అందిస్తారు.

Advertisement

అప్పుడు పద్మావతి ఏం చేసింది? నాన్నకి, పద్మావతికి మధ్య మానసికంగా జరిగిన సంఘర్షణ ఏంటి అనేది తెర మీద చూడాలి.నటీనటుల నటన గురించి హెబా పటేల్ నటనలో ఏమాత్రం మార్పు లేదు.

ఇంతకుముందు సినిమాల మాదిరిగానే అవే చేతులు ఊపుతూ, లిప్ సింక్ లేని డైలాగులు మాట్లాడటం తప్ప, కొత్తగా ఏమి చేయలేదు.రావు రమేష్ ఇలాంటి పాత్రలి ఇప్పటికి చాలాసార్లు పోషించారు.

ఉన్న ముగ్గురు హీరోలు ఫర్వాలేదు.కామెడియన్ బ్యాచ్ విసుగు తెప్పిస్తారు.

సాంకేతికవర్గం పనితీరు శేఖర్ చంద్ర సంగీతం యావరేజ్ గా ఉంది.చివరి రెండు పాటలు ఫర్వాలేరు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్ - బైడెన్‌ విజయావకాశాలపై జర్నలిస్ట్ ఫరీద్ జకారియా అంచనాలు

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా యావరేజ్.సినిమాటోగ్రాఫీ కొన్ని చోట్ల బాగుండి కొన్ని చోట్ల తేలిపోతుంది.

Advertisement

ఆర్ట్ డైరెక్టర్ పనితనం బాగుంది.హీరోయిన్ ఫ్లాట్ కలర్ ఫుల్ గా డిజైన్ చేసుకున్నారు.

విశ్లేషణ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, తీసిన విధానమే మెచ్చుకునేలా లేదు.కొన్ని సార్లు మారుతి తీసిన పాత సినిమాల్లా అనిపిస్తుంది, మరికొన్ని చోట్ల త్రివిక్రమ్ రాసినటువంటి డైలాగ్స్ వినబడతాయి.

మధ్యమధ్యలో పవన్ కళ్యాణ్ రిఫరెన్సులు.ఇక జబర్దస్త్ బ్యాచ్ చేసే కుళ్ళు కామెడి మరోవైపు.

చక్కగా హానేస్ట్ గా తీయాల్సిన సినిమాని గందరగోళం చేసేసారు.మాస్ కామెడి ఇష్టపడేవారు అక్కడక్కడ నవ్వుకోడానికి పర్లేదు.

కథని చూడాలనుకునే ప్రేక్షకులకి మాత్రం కష్టమే.హైలైట్స్ : * మాస్ కామెడి * కొన్ని డైలాగులు డ్రాబ్యాక్స్ : * గతి తప్పిన నరేషన్ * కుళ్ళు కామెడి సన్నివేశాలు * నటీనటుల నుంచి గొప్ప అభినయం లేకపోవడం చివరగా : యువత/మాస్ ప్రేక్షకులు అక్కడక్కడ నవ్వుకోవచ్చు తెలుగుస్టాప్ రేటింగ్ : 2.25/5.

తాజా వార్తలు