టైర్ 2 హీరోల్లో ఒకరైన నాచురల్ స్టార్ నాని కూడా పాన్ ఇండియన్ వ్యాప్తంగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన దసరా(Dasara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఆ లెవల్లోనే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు.ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు దసరా సినిమాతో నాని రాబోతున్నాడు.
ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో చాలా మంది హీరోలు సక్సెస్ కూడా సాధించారు.ఇక ఇప్పుడు టైర్ 2 హీరోల్లో ఒకరైన నాని(Nani) కూడా తన అదృష్టాన్ని పరీక్షించు కోబోతున్నాడు.
మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.శ్రీకాంత్ ఓదెల(Srikanth Odhela) దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా మార్చి 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.కాగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ గురించి తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 14న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వెన్యూ కూడా తాజాగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను లక్నో లోని ప్రతిభ థియేటర్ లో మధ్యాహ్నం 3 గంటల 33 నిముషాల నుండి స్టార్ట్ అవుతుంది అని తెలిపారు.మరి నాని ప్రెజెంట్ సౌత్ కంటే నార్త్ మీద ద్రుష్టి పెట్టి అక్కడ నుండి ప్రమోషన్స్ చేస్తూ తన సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు.
చూడాలి ఈ సినిమా ఆకట్టు కుంటుందో లేదో.







