నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మంచి స్పీడ్ మీద ఉన్నాడు.ఇప్పటికే వి సినిమాని ఇంద్రగంటి దర్శకత్వంలో పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసేశాడు.
ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.ఏకంగా ఒటీటీ సంస్థ 33 కోట్లకి వి మూవీ డిజిటల్ రిలీజ్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ మూవీని నాని చేస్తున్నాడు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.ఇప్పటికే సినిమా 50 శాతం పూర్తయినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్స్ గా చేస్తున్నారు.ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని శివ నిర్వాణ ఆవిష్కరిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా థీయట్రికల్ రైట్స్ ని 22 కోట్లు పెట్టి దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి బయటకి వచ్చి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన లక్ష్మణ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయడానికి హక్కులు సొంతం చేసుకున్నాడు.
ఇక శాటిలైట్ రైట్స్ కూడా టక్ జగదీశ్ మూవీకి అమ్ముడుపోయినట్లు సమాచారం.రిలీజ్ కాకుండా 30 కోట్లకి పైగా బిజినెస్ ని టక్ జగదీశ్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమా తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అంటూ పాన్ ఇండియా మూవీని నాని చేస్తున్నాడు.ఆ సినిమాని నాని కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా ఆవిష్కరిస్తున్నారు.
మొత్తానికి టాలీవుడ్ మార్కెట్ లో ఇప్పుడు నేచురల్ స్టార్ తన స్టామినాని గట్టిగానే చూపిస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు.