ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నాచురల్ స్టార్ నాని( Nani ) ఒకరు ఇటీవల హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాని వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే నాని గత రెండు రోజుల క్రితం తన పుట్టినరోజు( Nani Birthday ) వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ పుట్టినరోజు నానికి చాలా స్పెషల్ గా మారింది అని చెప్పాలి.

నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నింటిని కూడా ప్రకటించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అంతేకాకుండా నాని ప్రస్తుతం నటిస్తున్నటువంటి సరిపోదా శనివారం సినిమా( Saripodhaa Sanivaaram ) నుంచి కూడా వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారని చెప్పాలి.ఇలా నాని పుట్టినరోజు చాలా స్పెషల్ గా నిలిచింది.
ఇకపోతే ఈ పుట్టినరోజు వేడుకలను నాని తన ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే నాని భార్య అంజనా( Anjana ) నాని పుట్టినరోజు వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అంతేకాకుండా ఈ పుట్టినరోజు వేడుకలకు తన కుమారుడు అర్జున్( Arjun ) నానికి మరిచిపోలేనటువంటి గిఫ్ట్ ఇచ్చారని వెల్లడించారు అందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను కూడా అంజన సోషల్ మీడియాలో షేర్ చేశారు.వీడియోలో అర్జున్ మాట్లాడుతూ.
నాకిష్టమైన మా నాన్నకు మ్యూజిక్ అంటే ఇష్టం.అందుకనే ఈ బర్త్ డే కి గిఫ్ట్ గా ఒక మ్యూజిక్ చేసి ఇస్తాను అంటూ పియానో పై( Piano ) మ్యూజిక్ ప్లే చేశాడు.
అర్జున్ పియానో ప్లే చేస్తుండగా.పక్కనే కూర్చున్న నాని తనయుడిని చూస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఇది చూసి అభిమానులు కూడా ఎంతో ఫిదా అవుతున్నారు.