Nani Son Arjun : తండ్రికి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన నాని తనయుడు.. ఎప్పటికీ మరిచిపోలేనిది?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నాచురల్ స్టార్ నాని( Nani ) ఒకరు ఇటీవల హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాని వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే నాని గత రెండు రోజుల క్రితం తన పుట్టినరోజు( Nani Birthday ) వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ పుట్టినరోజు నానికి చాలా స్పెషల్ గా మారింది అని చెప్పాలి.

"""/" / నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నింటిని కూడా ప్రకటించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా నాని ప్రస్తుతం నటిస్తున్నటువంటి సరిపోదా శనివారం సినిమా( Saripodhaa Sanivaaram ) నుంచి కూడా వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారని చెప్పాలి.

ఇలా నాని పుట్టినరోజు చాలా స్పెషల్ గా నిలిచింది.  ఇకపోతే ఈ పుట్టినరోజు వేడుకలను నాని తన ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు.

"""/" / ఈ క్రమంలోనే నాని భార్య అంజనా( Anjana ) నాని పుట్టినరోజు వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అంతేకాకుండా ఈ పుట్టినరోజు వేడుకలకు తన కుమారుడు అర్జున్( Arjun ) నానికి మరిచిపోలేనటువంటి గిఫ్ట్ ఇచ్చారని వెల్లడించారు అందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను కూడా అంజన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వీడియోలో అర్జున్ మాట్లాడుతూ.నాకిష్టమైన మా నాన్నకు మ్యూజిక్ అంటే ఇష్టం.

అందుకనే ఈ బర్త్ డే కి గిఫ్ట్ గా ఒక మ్యూజిక్ చేసి ఇస్తాను అంటూ పియానో పై( Piano ) మ్యూజిక్ ప్లే చేశాడు.

అర్జున్ పియానో ప్లే చేస్తుండగా.పక్కనే కూర్చున్న నాని తనయుడిని చూస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఇది చూసి అభిమానులు కూడా ఎంతో ఫిదా అవుతున్నారు.

వైరల్ వీడియో: పెళ్లయితున్న ఆనందంలో రెచ్చిపోయిన పెళ్లి కుమారుడు..