సినిమా చూడగానే ప్రేక్షకులు అరెరే మన పక్కింటి కుర్రాడు లాగే ఉన్నాడు అనుకునే హీరోలు టాలీవుడ్ లో చాలా తక్కువ మంది ఉన్నారు.ఇక్కడ ఇలాంటి హీరోలలో మొదటి వరుసలో ఉంటాడు నానీ.
అయితే లుక్స్ పరంగా మాత్రమే కాదండోయ్ పాటు నటన పరంగా కూడా నాని పక్కింటి కుర్రాడు లాగే అనిపిస్తూ ఉంటాడు.సినిమా చూసే ప్రేక్షకులు వెళ్లి ఆ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుందో కూడా నానీ నటన అంత నాచురల్గా ఉంటుంది.
అందుకే తెలుగు ప్రేక్షకులకు నాచురల్ స్టార్ గా మారిపోయాడు నాని.ఇక వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ భిన్నమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
ఇక ఇలాంటి డిఫరెంట్ కథాంశంతో కూడిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో దూసుకుపోయాడు.ఇక ఆ తర్వాత కాలంలో మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూశాడు నాచురల్ స్టార్ నాని.
ఇక 2008 లో విడుదలైన జెర్సీ సినిమా తర్వాత నానికి మంచి హిట్ మాత్రం లభించలేదు.నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్న కమర్షియల్గా మాత్రం వర్కౌట్ కాలేదు.
ఇక ఓటిటి లో విడుదలైన ‘వి’సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా లాభాలు తెచ్చిపెట్ట లేదు.ఇక నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ తో టక్ జగదీష్ లాంటి సినిమా చేసిన ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయింది.

ఇలాంటి సమయంలో రోటీన్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి హిట్ కొట్టాడు నాని.ఇక ఇటీవలే అంటే సుందరానికి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాకు వస్తున్న టాక్ వసూళ్లు చూస్తూ ఉంటే ఈ సినిమాతో మరో హిట్ అతని ఖాతాలో పడిపోయింది అని అర్థమవుతుంది.ముఖ్యంగా ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పాలి.
ఇప్పుడు తన కెరియర్లోనే ఎప్పుడూ కనిపించనంత మాస్ లుక్తో దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఇక ఈ సినిమాతో మరోసారి హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడుతున్నాడు నాని.
ఏం జరుగుతుందో చూడాలి.







