చెప్పులు వేసుకుని తిరిగితే నేరం ఏంటి? ఇదేదో విచిత్రంగా ఉంది.ఇదేదో మాకేం అర్థం కావడం లేదు అని అనుకుంటున్నారా? ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారు.మీరు విన్నది అక్షరాలా నిజమే.ఆ ఊర్లో చెప్పులు వేసుకుని తిరగడం నేరమే.అంతేకాదు చెప్పులు వేసుకుని ఎవరైనా తిరిగితే పంచాయతీ పెట్టి శిక్ష విధిస్తున్నారు.ఇదేమి వింత అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ స్టోరీ చదివేయాల్సిందే.ఈ వింత ఊర తమిళనాడులోని చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ విలేజ్ పేరు అండమాన్.ఈ గ్రామంలో మొత్తం 130 కుటుంబాలు జీవిస్తున్నాయి.దాదాపుగా అందరూ వ్యవసాయం చేసుకుని జీవించేవారే.
ఈ ఊరి ప్రజలు భూమిని పవిత్రంగా భావిస్తున్నారు.భూమిపై చెప్పులు వేసుకుని తిరిగే దేవుడికి కోపం వస్తుందని నమ్ముతారు.అందుకే గ్రామంలో చెప్పులు వేసుకుని తిరగరు.వృద్ధులు మాత్రమే మధ్యాహ్నం పూట ఎండవల్ల చెప్పులు వేసుకుని తిరుగుతారు.మిగతా ఎవరూ చెప్పులు వేసుకుుని గ్రామంలో తిరగరు.
ఇక బయట నుంచి గ్రామానికి ఎవరు వచ్చినా సరే చెప్పులు గ్రామం బయట వదిలేసి రావాల్సిందే.
గ్రామ ప్రవేశద్వారాం వద్ద ఒక పెద్ద చెట్టు ఉంటుంది.ఆ చెట్టుకు గ్రామస్తులందరూ పూజలు చేస్తూ ఉంటారు.
ఆ చెట్టును పవిత్రంగా భావిస్తున్నారు.గ్రామస్తులు లేదా గ్రామంలోకి వచ్చేవారు ఆ చెట్టుకి ముందే తమ చెప్పులు వదిలేసి రావాలి.
ఆ చెట్టు దాటి చెప్పులు వేసుకుని గ్రామంలోకి రాకూడదు.వస్తే పంచాయతీ పెట్టి శిక్ష విధిస్తారు.
మాములుగా మనం గుడిలోకి వెళ్లినప్పుడో.లేదా ఏదైనా పవిత్ర స్థలానికి వెళ్లినప్పుడో.
పూజలు, హోమాలు చేసేటప్పుడో చెప్పులు వేసుకోవు.కానీ అండమాన్ గ్రామస్తులు ఇలా చెప్పులు వేసుకోకుండా తిరగడం అనే ఆచారం చాలా విచిత్రంగా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.







