దసరా మూవీ రివ్యూ: ఊరమాస్ గా అదరగొట్టిన నాచురల్ స్టార్!

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల( Director Srikanth odela )దర్శకత్వంలో రూపొందిన సినిమా దసరా( Dasara ).

ఇందులో నాచురల్ స్టార్ హీరో నాని, కీర్తి సురేష్ జంటగా నటించారు.

అంతేకాకుండా సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు.ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.

ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఫిదా చేశాయి.

మరి ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఇందులో నాని( Nani ) ధరణి అనే పాత్రలో కనిపిస్తాడు.

Advertisement

ఇక ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు.

కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు.ఇలా ప్రతిరోజు అతని లైఫ్ సాగుతూ ఉంటుంది.

అయితే ఓసారి చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్ లో కూడా గొడవపడి మర్చిపోతాడు.కానీ చిన్న నంబి మాత్రం ఆ గొడవను అస్సలు మర్చిపోడు.

దానిని చాలా సీరియస్ గా తీసుకుంటాడు.అలా ధరణి చేసిన పొరపాటు వల్ల ఆయన ప్రియురాలు వెన్నెల (కీర్తి సురేష్)( Keerthy Suresh ), అతని స్నేహితులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

దీంతో వారిని కాపాడటం కోసం ధరణి ఏం చేస్తాడు అన్నది.చివరికి ధరణి ఎలా మారుతాడు అనేది మిగిలిన కథలోని.

Advertisement

నటినటుల నటన:

నటి నటుల నటన విషయాలు చూస్తే నాని నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏ పాత్రకైనా నాని అదరగొట్టేస్తాడు.ఇక ఈ సినిమాలో ధరణి పాత్రతో మాత్రం పూర్తిగా మార్కులు కొట్టేశాడు.

అందులో ఆయన భాష, లుక్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి.ఇక వెన్నెలగా కీర్తి సురేష్ నటించింది.

తన లుక్ తో, మాటలతో బాగా ఆకట్టుకుంది.ఇక దీక్షిత్ శెట్టి కూడా నాని స్నేహితుడిగా బాగా నటించాడు.

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో( Shine Tom Chacko ) కూడా నెగటివ్ పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు.మిగతా నటినటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

ఇక టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు మంచి కథలు అందించాడు.ఎమోషనల్, యాక్షన్స్, మంచి మంచి ఎలివేషన్లు బాగా చూపించాడు.

సత్యం సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.సంతోష్ నారాయణన్ అందించిన పాటలు కూడా ప్రేక్షకులను ఫిదా చేశాయి.

మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

విశ్లేషణ:

తెలంగాణ బొగ్గు గనుల నేపథ్యం( Coal Mines )లో ఈ సినిమా కథను ప్రతి ఒక్కరికి మనసుకు తాకే విధంగా చూపించాడు డైరెక్టర్.ఇక ఫస్ట్ ఆఫ్ లో కామెడీ, యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.ఇక ఇంటర్నెట్ ట్విస్ట్ మామూలుగా ఉండదని చెప్పాలి.

మొత్తానికి ఈ సినిమాను మంచి ఎమోషనల్, యాక్షన్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, కథ, ఎమోషనల్ సన్నివేశాలు, సంగీతం, సినిమాటోగ్రఫీ.

మైనస్ పాయింట్స్:

కథనం అక్కడక్కడ ఊహించినట్లుగా అనిపించింది.

బాటమ్ లైన్:

మంచి పల్లె బ్యాక్ డ్రాప్ కథతో డైరెక్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.పైగా స్ట్రాంగ్ నటుల కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమా ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ డ్రామా అని చెప్పాలి.కాబట్టి యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది.

రేటింగ్: 3/5

తాజా వార్తలు