నాని 'దసరా' 30 మార్చి 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల

నేచురల్ స్టార్ నాని మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ తో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

 Nani Keerthy Suresh Dasara Movie Release Date Out Details, Nani, Keerthy Suresh,-TeluguStop.com

కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ఈ చిత్రం కోసం ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్నారు నాని.ఈ పాత్ర కోసం మాస్, రగ్గడ్ లుక్ లోకి మేకోవర్ అయ్యారు నాని.

సినిమా అనౌన్స్ మెంట్ వీడియోలో నాని తెలంగాణ యాస అందరినీ ఆశ్చర్యపరిచింది.నాని సినిమా అంతా మాస్ డైలాగులు పలకడం ఒక పండగే.

స్పార్క్ ఆఫ్ దసరా గ్లింప్స్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా నిర్మాతలు బిగ్ అప్‌డేట్‌ ఇచ్చారు.దసరా 30 మార్చి, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.30మార్చి, 2023 శ్రీరామ నవమి.ఆ తర్వాత నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ఉంటుంది.అలాగే వేసవి సెలవులు కూడా సినిమాకి కలసిరానున్నాయి.అన్ని భాషల్లో సినిమా విడుదలకు ఇది సరైన సమయం.

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో మాస్‌గా కనిపిస్తున్నారు నాని.

శరీరం, దుస్తులపై నిండి, గుబురుగా ఉన్న జుట్టు, చేతిలో ఉన్న మద్యం సీసాతో రగ్గడ్ లుక్ లో కనిపించారు.బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకప్పటి పాపులర్ స్టార్ సిల్క్ స్మిత తన గోళ్లు కొరికే సిగ్నేచర్ ఫోటోని కూడా చూడొచ్చు.

ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లో నిన్నటి నుంచి తిరిగి ప్రారంభమైంది.ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌ లో పాల్గొంటున్నారు.

నాని సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని (తెలంగాణ)లోని సింగరేణి బొగ్గు గనులలో ఉన్న ఒక గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతోంది.

నాని ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నారు.

సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌ గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

తారాగణం:

నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు.

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల , నిర్మాత: సుధాకర్ చెరుకూరి, బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, డీవోపీ: సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ, సంగీతం: సంతోష్ నారాయణన్, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్ : విజయ్‌ చాగంటి, ఫైట్స్: అన్బరివ్, పీఆర్వో: వంశీ- శేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube