న్యాచురల్ స్టార్ నాని( Nani ) హీరోగా కొత్త దర్శకుడు శౌర్యువ్ ( Shouryuv )డైరెక్షన్ లో వస్తున్న సినిమా హాయ్ నాన్న.ఈ సినిమా వైరా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా శృతి హాసన్ కూడా నటిస్తుంది.ఈ సినిమాలో మరోసారి నాని తండ్రి పాత్రలో కనిపించనున్నాడు.
ఆల్రెడీ నాని జెర్సీ( Jersey ) సినిమాలో ఫాదర్ రోల్ లో మెప్పించాడు.మరోసారి నాని మార్క్ న్యాచురల్ నటన ఫ్యాన్స్ అని అలరించనుంది.
దసరా లాంటి మాస్ సినిమా తర్వాత నాని మరోసారి హాయ్ నాన్న లాంటి క్లాస్ సినిమాతో వస్తున్నాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రాలేదు.అసలైతే డిసెంబర్ 23న రిలీజ్ అని మొన్నామధ్య టీజర్ లో రిలీజ్ డేట్ ప్రకటించినా ఆ డేట్ కి నాని సినిమా రావడం కష్టమే అని అంటున్నారు.డిసెంబర్ క్రిస్మస్ రేసులో చాలా సినిమాలు పోటీకి వస్తున్నాయి.
ఆ పోటీకి తట్టుకోవడం కష్టమే అన్న భావనతో ఎలాగు సంక్రాంతికి పెద్ద సినిమాలు సైడ్ అవుతున్నాయి కాబట్టి హాయ్ నాన్నని నాని పొంగల్ రేసులో దించాలని చూస్తున్నారట.నాని హాయ్ నాన్న 2024 సంక్రాంతికి వాయిదా పడిందా లేదా అనుకున్నట్టుగా క్రిస్ మస్ రేసులో దిగుతుందా అన్నది త్వరలో తెలుస్తుంది.