''హాయ్ నాన్న'' ఫాన్స్ కు ఎగ్జైటింగ్ న్యూస్.. ఇక ప్రతిరోజు పండుగే!

దసరా( Dasara ) వంటి బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఊపు మీద ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani).ఈ సినిమాతో అప్పటి వరకు ఉన్న క్లాస్ ఇమేజ్ తో పాటు నానికి మాస్ ఇమేజ్ కూడా వచ్చింది.

 Nani Hi Nanna Pramotions, Dasara, Nani, Hi Nanna, Shouryuv, Mrunal Thakur,kiara-TeluguStop.com

అంతటి బిగ్ హిట్ తర్వాత నాని ఇప్పుడు రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.కొత్త డైరెక్టర్ శౌర్యన్ తో ”హాయ్ నాన్న”( Hi Nanna ) సినిమా చేస్తున్నాడు.

తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ సినిమాలో నాని, మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) జంటగా నటిస్తున్నారు.

నాని తండ్రిగా, లవర్ గా అలరించనున్నాడు.మరి దసరా తర్వాత చేస్తున్న ఈ సినిమా ఈయన కెరీర్ కు ప్లస్ అవుతుందో లేదో చూడాలి.

ఈ సినిమా డిసెంబర్ 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఈ క్రమంలోనే మేకర్స్ సరికొత్త ప్రమోషన్స్ తో ఆడియెన్స్ ముందుకు వస్తూ అంచనాలు మరింత పెంచుతూ పోతున్నారు.ఈ రోజు నుండి సాలిడ్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నామంటూ మేకర్స్ మరో కొత్త అప్డేట్ ఇచ్చారు…

ఈ రోజు నుండి ప్రతీ రోజు పండుగే.రిలీజ్ వరకు రోజు ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ అందిస్తూ ఉంటామని వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు తెలిపారు.దీంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం.ఇక ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా( Kiara Khanna ) కీ రోల్ పోషిస్తున్నారు.వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube