యువ హీరో నాగ శౌర్య తన లేటెస్ట్ సినిమా కృష్ణ వ్రిందా విహారి సినిమాతో ఈ నెల చివరన రాబోతున్నాడు.ఈ సినిమాలో నాగ శౌర్య సరసన షిర్లే సెతియా హీరోయిన్ గా నటిస్తుంది.
అనీష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో ఉషా నిర్మిస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ కాగా అందులో నాగ శౌర్య పాత్ర బ్రాహ్మణ కుర్రాడిగా కనిపిస్తున్నాడని తెలుస్తుంది.
సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
అయితే రీసెంట్ గా నాని కూడా అంటే సుందరానికీ సినిమాలో కూడా బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో నటించాడు.
ఆ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు.నాని తర్వాత మళ్లీ అదే తరహా పాత్రతో నాగ శౌర్య వస్తున్నాడు.
అయితే నాగ శౌర్య సినిమాలో కథ డిఫరెంట్ గా ఉంది.మరి నాని నిరాశరచిన ఆ పాత్రలో నాగ శౌర్య మెప్పిస్తాడా లేదా అన్నది చూడాలి.
కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో కెరియర్ లో వెనకపడ్డ నాగ శౌర్య ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు