న్యాచురల్ స్టార్ నాని ఈసారి గట్టిగా కొట్టబోతున్నట్టే అనిపిస్తుంది.ఎప్పుడు క్లాస్ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించిన నాని ఇప్పుడు మాస్ హీరోగా పిలిపించు కోవాలని తహతహ లాడుతున్నాడు.
ఇప్పటికే స్టార్ హీరోలంతా పాన్ ఇండియా బాట పట్టిన విషయం తెలిసిందే.పాన్ ఇండియా లెవల్లో చాలా మంది హీరోలు సక్సెస్ కూడా సాధించారు.
ఇక ఇప్పుడు నాని కూడా పాన్ ఇండియన్ వ్యాప్తంగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ”దసరా” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఆ లెవల్లోనే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు.ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు దసరా సినిమాతో నాని రాబోతున్నాడు.

అందుకే నార్త్ లో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.ఈ ట్రైలర్ తెలుగులో ఎంత రెస్పాన్స్ అందుకుందో హిందీలో కూడా 24 గంటలు గడవక ముందే మిళియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.దీంతో నాని ఎంట్రీ హిందీలో గట్టిగానే ఉండేలా కనిపిస్తుంది.
తెలుగు తర్వాత హిందీ మార్కెట్ లో దసరా సినిమా ఎఫెక్ట్ గట్టిగానే ఉండేలా ఉందని అంతా చెబుతున్నారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా మార్చి 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.కాగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.







