న్యాచురల్ స్టార్ నాని( Nani ) పాన్ ఇండియా వైడ్ గా తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు సిద్ధం అవుతున్నాడు.ఇప్పటి వరకు ఎన్నో క్లాస్ సినిమాలను నటించి మెప్పించిన నాని ఇప్పుడు కొత్తగా మాస్ లోకి దిగాడు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘‘దసరా”( Dasara ).కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ రేస్ లో బరిలో దిగబోతుంది.

ఈ సినిమాపై నాని చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.ముందు నుండి ఈయన కాన్ఫిడెంట్ తో ఉండడం సినిమాకు కూడా ప్లస్ అయ్యింది.అందుకే ఈ సినిమా బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా యూనిట్ మొత్తం పాన్ ఇండియా లెవల్లో అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నారు.
తాజాగా చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ కోసం వైజాగ్ చేరుకున్నారు.అక్కడ ఈ రోజు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో ప్రమోషన్స్ చేయడానికి మంచి ప్లాన్ తో వైజాగ్ ( Vizag ) లో అడుగు పెట్టారు.
కానీ వాతావరణం చూస్తుంటే వీరి ప్లాన్స్ అన్ని ప్లాప్ అయ్యేలా కనిపిస్తున్నాయి.ఎందుకంటే ఈ రోజు కూడా వర్షాల కారణంగా మ్యాచ్ జరిగే పరిస్థితి లేదు.

మరి మ్యాచ్ కనుక జరుగక పోతే దసరా టీమ్ ప్లాన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది.మరి సాయంత్రానికి వాతావరణ పరిస్థితులు ఎలా మారుతాయో వేచి చూడాలి.ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.కాగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.చూడాలి నాని కాన్ఫిడెంట్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో.







