దసరా సినిమాతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన నాని... ఎన్టీఆర్ రికార్డును కూడా బ్రేక్ చేస్తూ?

టాలీవుడ్ యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని (Nani ) దసరా సినిమా( Dasara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

 Nani, Mahesh Babu, Ntr, Dasara Movie, Keerthy Suresh , Bhale Bhale Magadivoy ,-TeluguStop.com

నాని సినీ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా దసరా సినిమా నిలిచిపోయింది.ఈ సినిమా అన్ని ఏరియాలలోను ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ నాని ఖాతాలో అద్భుతమైన హిట్ పడేలా చేసింది.

ఇలా దసరా సినిమా ద్వారా అద్భుతమైన హిట్ అందుకున్నటువంటి నాని సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియంలో నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్నటువంటి నాని ఓవర్సీస్ లో మాత్రం స్టార్ హీరోలతో పోటీగా ముందుకు కొనసాగుతున్నారు.ఇలా ఓవర్సీస్ లో ఈయన నటించిన సినిమాలు ఇప్పటికే 7 సినిమాలు 1 మిలియన్ మార్క్ దాటిపోయాయి.ఇలా నాని నటించినటువంటి దసరా సినిమా కూడా నేటితో వన్ మిలియన్ మార్క్ దాటిపోవడంతో నాని సరికొత్త రికార్డు సృష్టించారు.

ఇదివరకే నాని నటించిన ఈగ, ‘భలే భలే మగాడివోయ్( Bhale Bhale Magadivoy )’, ‘నేను లోకల్’, ‘నిన్ను కోరి’, ఎంసీఏ, ‘జెర్సీ’, ‘అంటే సుందరానికీ!’ మొదలైన సినిమాలు వన్ మిలియన్ మార్క్ దాటిపోయాయి.

ఇక దసరా సినిమా కూడా వన్ మిలియన్ మార్క్ దాటిపోవడంతో నాని ఏకంగా ఎన్టీఆర్( NTR ) రికార్డును కూడా బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించారు.ఇప్పటివరకు ఓవర్సీస్ లో వన్ మిలియన్ దాటినటువంటి హీరోలలో మహేష్ బాబు(Mahesh Babu) ముందు వరుసలో ఉన్నారు.ఇలా మహేష్ బాబు( Mahesh Babu ) 11 సినిమాలతో మొదటి స్థానంలో ఉండగా నిన్నటి వరకు ఎన్టీఆర్ ఏడు సినిమాలతో రెండవ స్థానంలో ఉన్నారు అయితే తాజాగా నాని ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేస్తూ రెండో స్థానంలో నిలిచారు.

ఇలా ఓవర్సీస్ లో నాని ఏకంగా సూపర్ స్టార్ గ్లోబల్ స్టార్ వంటి హీరోలతో పోటీ పడుతూ ముందుకు కొనసాగడంతో నాని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube