నాని సినిమాకి భలే క్రేజ్‌.. అక్కడ మొత్తం బిజినెస్ క్లోజ్‌ చేశారట

నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో రూపొందుతున్న దసరా సినిమా మార్చి చివరి లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా దసరా సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయడం జరిగింది.

 Nani And Keerthy Suresh Dasara Movie Pre Release Business ,dasara , Keerthy Sure-TeluguStop.com

ఈ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదలైనప్పటి నుండే నాని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అంచనాలు పెంచుకున్నారు.తాజాగా టీజర్ విడుదలైన తర్వాత ఆ అంచనాలు మరింతగా పెరిగాయి.

ముఖ్యం గా నాని చేస్తున్న వ్యాఖ్యలు సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తున్నాయి అనడంలో సందేహం లేదు.ఏకంగా కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమా లతో పోల్చి తమ సినిమా గురించి చెబుతున్న నేపథ్యం లో దసరా సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా నెలకొన్నాయి.

Telugu Dasara, Keerthy Suresh, Nani, Nani Dasara, Srikanth Odela-Movie

ఆ అంచనాల నేపథ్యంలో దసరా ముందస్తు బిజినెస్ భారీగా జరుగుతుందని సమాచారం అందుతుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రాలోని దాదాపు అన్ని ఏరియా లో కూడా దసరా సినిమా అమ్ముడు పోయిందని, నైజాంలో కూడా భారీ మొత్తానికి ప్రముఖ నిర్మాత కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది.అంతే కాకుండా సినిమా కు పెట్టిన పెట్టుబడి తో పోలిస్తే థియేట్రికల్‌ బిజినెస్ ద్వారా వస్తున్న మొత్తం కాస్త ఎక్కువగానే ఉంటుందట.

Telugu Dasara, Keerthy Suresh, Nani, Nani Dasara, Srikanth Odela-Movie

దీన్ని బట్టి చూస్తే దసరా విడుదలకు ముందే భారీ లాభాలను నిర్మాతకు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.ఏమాత్రం సక్సెస్ టాక్ దక్కించుకున్న కూడా నాని నిర్మాత పంట పండినట్లే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దసరా సినిమాలో నాని లుక్ మరియు ఆయన బాడీ లాంగ్వేజ్ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఉన్నాయి.

అందుకే కాస్త ఎక్కువ బిజినెస్ జరుగుతున్నట్లు అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube