ఒక వైపు వాయిదా అంటూనే మరో వైపు పాటల విడుదల ఎందుకు భయ్యా?

స్టార్ హీరోయిన్ సమంత శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా వేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

 Samantha Shakuntalam Movie Release Rumors , Gunashekhar,samantha, Samantha New-TeluguStop.com

సినిమా వాయిదా విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు అతి త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.ఒక వైపు సినిమా వాయిదా వార్తలు వస్తూ ఉంటే మరో వైపు చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమా నుండి పాటలను విడుదల చేస్తున్నారు.

సినిమా విడుదల వాయిదా వార్తలు వచ్చిన తర్వాత కూడా ఒక పాట విడుదల చేయడం తో విడుదల వాయిదా పడలేదా అంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Gunashekhar, Samantha, Shakuntalam-Movie

సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది.సినిమా విడుదలకి ముందు సాధారణంగా ట్రైలర్ విడుదల చేస్తారు.కానీ సినిమా వాయిదా పెడితే మరో ట్రైలర్ విడుదల చేయాల్సి ఉంటుంది.

అలా మరో ట్రైలర్ విడుదల చేయడం అంటే కంటెంట్ ను మరింత ఎక్కువ చూపించడం అవుతుంది.అది సినిమాకు మంచిది కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది.ఏది అయితే అది అయ్యింది అనుకోని ఫిబ్రవరి 17వ తారీఖున శాకుంతలం సినిమా ను విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

Telugu Gunashekhar, Samantha, Shakuntalam-Movie

సమంతా ఫ్యాన్స్ మాత్రం దర్శక నిర్మాత గుణశేఖర్ పై విడుదల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.దిల్ రాజు ఈ సినిమా ను సమర్పిస్తున్న విషయం తెలిసిందే.ఆయన గట్టిగా తలుచుకుంటే ఫిబ్రవరి 17వ తారీఖున విడుదల చేయడం కష్టమేం కాదు, కానీ శాకుంతలం సినిమా విడుదల విషయంలో నిర్ణయాలు మార్చుకునేది ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube