టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోయిన్లు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ వస్తే కథ, పాత్ర గురించి కూడా తెలుసుకోకుండా ఆ సినిమాలకు ఓకే చెబుతున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.అయితే అలా కథ, పాత్రలను పట్టించుకోని హీరోయిన్లు ఆ తర్వాత రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సి ఉంది.
వరుస ఫ్లాపుల వల్ల ప్రస్తుతం టాలీవుడ్ లో కృతిశెట్టి హవా తగ్గిందనే సంగతి తెలిసిందే.
ఈ హీరోయిన్ లా కొన్నేళ్ల క్రితం నటిగా ఒక వెలుగు వెలిగిన రకుల్ కూడా కొన్ని సినిమాల ఎంపికలో చేసిన తప్పుల వల్ల ఆఫర్లను కోల్పోయారు.
రకుల్ నటించిన సినిమాలలో స్పైడర్ ఒకటి కాగా ఈ సినిమాలో రకుల్ రోల్ కొంచెం బోల్డ్ గా ఉంటుంది.ఈ సినిమాలో రకుల్ లుక్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండవు.
ఈ సినిమాలోని పాత్ర రకుల్ కు మైనస్ అయింది.ఈ సినిమా వల్లే రకుల్ కు ఆఫర్లు తగ్గాయని టాక్ ఉంది.

వాస్తవానికి బన్నీ, తారక్, చరణ్ లకు జోడీగా నటించిన సినిమాలలోని పాత్రలు రకుల్ కు మంచి పేరును తెచ్చిపెట్టడంతో పాటు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించాయి.కానీ స్పైడర్ సినిమా ఫ్లాప్ తో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు.కొండపొలం సినిమా కూడా డిజాస్టర్ కావడం రకుల్ కు మరో షాకిచ్చింది.వరుస ఫ్లాపుల వల్ల రకుల్ మార్కెట్ కూడా తగ్గింది.

కొత్త హీరోయిన్ల హవా కూడా రకుల్ దూకుడుకు బ్రేకులు వేసింది.రకుల్ మళ్లీ తెలుగులో పూర్వ వైభవం సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పాత్రల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే రకుల్ కు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.







