నాచురల్ స్టార్ ట్యాగ్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో బయటపెట్టిన నాని?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉండేవారికి పేరుకు ముందు పలు ట్యాగ్ లు ఉండడం సర్వసాధారణం.

ఇలా ఇండస్ట్రీలో మెగాస్టార్, పవర్ స్టార్ , ఐకాన్ స్టార్ వంటి ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోనే నాని( Nani ) పేరుకు ముందు కూడా నాచురల్ స్టార్( Natural Star ) అనే ట్యాగ్ మనకు కనబడుతుంది.అసలు నాచురల్ స్టార్ అనే ట్యాగ్ అనే ఎందుకు పెట్టుకున్నారు? ఈ ట్యాగ్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి.అనే విషయాల గురించి తాజాగా నాని స్పందించారు.

ఇక ఈ ట్యాగ్ వెనుక ఉన్న సీక్రెట్ కూడా ఈయన బయట పెట్టారు.

తాజాగా నాని దసరా( Dasara ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేచురల్ స్టార్ ట్యాగ్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టారు.నేచురల్ స్టార్ అనేది అభిమానులు తనని ముద్దుగా పిలుచుకునే పేరు అంటూ ఈయన తెలిపారు.

Advertisement

ఇలా ప్రేక్షకులు తమ ప్రేమని ఈ టాగ్ రూపంలో తనకు అందజేస్తున్నారని తెలిపారు.ఇక అభిమానులు తనని తన ఇంట్లో మనిషిలాగ ఒక ఫ్రెండ్ లాగా భావిస్తున్నారని అదే తనకు ప్లస్ పాయింట్ అయిందని తెలిపారు.

నిజానికి ప్రేక్షకులు తనకు ఇచ్చినటువంటి ఈ పదానికి నేను సరైన న్యాయం చేస్తున్నానా అంతటి సామర్థ్యం నాకుందా లేదా అనే విషయం తెలియదు కానీ ఆ పదంతో నేను ఆడియన్స్( Audience )కు చాలా దగ్గర అవుతున్నానని, మా మధ్య స్పెషల్ బాండింగ్ ఏర్పడుతుందని నాని తెలిపారు.ఇక అది కేవలం ట్యాగ్ మాత్రమే కాదని అభిమానుల ప్రేమకు, వారు తనని ఎంతలా ఆదరిస్తున్నారు,అభిమానిస్తున్నారనే విషయానికి నిదర్శనం అంటూ ఈ సందర్భంగా నాని నాచురల్ స్టార్ అనే ట్యాగ్ వెనుక ఉన్నటువంటి సీక్రెట్ తెలియజేశారు.ప్రస్తుతం నాని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు