నాని మళ్లీ పాన్ ఇండియా మూవీ అంటున్నాడు.. ఈసారైనా దక్కేనా?

ఈ మధ్య కాలంలో యంగ్ హీరో ల నుండి సీనియర్ హీరో ల వరకు చాలా మంది కూడా పాన్ ఇండియా సినిమా లు అంటూ తెగ హంగామా చేస్తున్నారు.సోషల్ మీడియా లో కూడా పాన్ ఇండియా రేంజ్ స్టార్‌ డమ్‌ కోసం ఆశ పడుతున్న వారు చాలా మంది ఉన్నారు.

 Nani 30 Movie Interesting Update , Nani 30 Movie, Shyam Singarai, Dussehra Movie-TeluguStop.com

నాని కూడా శ్యామ్‌ సింగరాయ్( Shyam Singarai ) మొదలుకుని మొన్న విడుదల అయిన దసరా సినిమా వరకు కూడా పాన్ ఇండియా మూవీ అంటూ ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేశాడు.కొన్ని కారణాల వల్ల శ్యామ్ సింగరాయ్ ని తెలుగు తప్ప ఇతర భాష ల్లో విడుదల చేయలేక పోయారు.

ఇక దసరా సినిమా( Dussehra movie ) ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయితే చేశారు కానీ పెద్దగా వసూళ్లు రాబట్టలేదు.తెలుగు లో పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు సాధించినా కూడా ఇతర భాష ల్లో మాత్రం నామమాత్రంగానే సందడి కనిపించింది.ఇప్పటికి కూడా నాని( Nani ) కి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లేదు.ఇలాంటి సమయంలో ఆయన చేస్తున్న 30వ సినిమా ను పాన్ ఇండియా మూవీ అంటూ ప్రకటించారు.

కొత్త దర్శకుడి తో నాని చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి.ఈ సినిమా లో నాని కి జోడీగా మృణాల్‌ ఠాకూర్( Mrinal Thakur ) నటిస్తున్న విషయం తెల్సిందే.

ఇక ఈ సినిమా కు డియర్ నాన్న అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారట.నాన్న గా నాని కనిపించబోతున్నాడు.

ఒక మంచి ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఓరియంటెడ్‌ మూవీ గా ఈ సినిమా ఉంటుంది అంటున్నారు.ఇలాంటి సినిమా లకు పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ దక్కడం కష్టం.అయినా కూడా నాని మాత్రం దీనిని పాన్ ఇండియా మూవీ గా తీర్చి దిద్దుతున్నాం అంటూ ప్రకటించాడు.అంతే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం అంటున్నాడు.

మరి ఈసారి అయినా నాని పాన్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అయ్యేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube