Geeta Madhuri : గీతామాధురి నందుల కొడుకు పేరు ఇదే.. బుడ్డోడే కాదు పేరు కూడా క్యూట్ అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు గీతా మాధురి , నందు( Geeta Madhuri, Nandu ) దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ ( Tollywood ) లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు.

 Nandu Geetha Madhuri Son Naming Ceremony-TeluguStop.com

ఇటీవల కాలంలో గీతా మాధురి నందు దంపతుల పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.

ఇటీవల గీతా మాధురి ప్రెగ్నెంట్ వేడుకను నిర్వహించగా ఆ తరువాత నందు దంపతులు అనాధలకు స్వయంగా వంటలు చేసి వడ్డించిన విషయం తెలిసిందే.

Telugu Dakshayani, Geetha Madhuri, Ceremony, Nandu, Nandugeetha-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా నందు గీతా మాధురి దంపతుల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.అయితే వీరికి ఇదివరకే దాక్షాయని( Dakshayani ) అనే కూతురు ఉండగా ఇటీవల ఒక బాబు పుట్టిన విషయం తెలిసిందే.ఫిబ్రవరి 10న బాబు జన్మించాడంటూ కొద్దిరోజుల క్రితమే అభిమానులతో గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకుంది సింగర్‌ గీతా మాధురి.

తాజాగా వీరు బాబు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు.బుడ్డోడికి ధృవధీర్‌ తారక్‌( Dhruvadhir Tarak ) అని నామకరణం చేశారు.ఈ ఫంక్షన్‌కు బంధువులతో పాటు ఇండస్ట్రీ మిత్రులు కూడా హాజరయ్యారు.మీ బుడ్డోడే కాదు, అతడి పేరు కూడా భలే క్యూట్‌గా ఉందంటూ వేడుకకు హాజరైన సెలబ్రిటీలు అభిప్రాయపడుతున్నారు.

Telugu Dakshayani, Geetha Madhuri, Ceremony, Nandu, Nandugeetha-Movie

బారసాల ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.గీతా మాధురి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కాగా గీతామాధురి సింగర్‌ రాణిస్తుండగా నందు ఓపక్క హీరోగా, మరోవైపు స్పోర్ట్స్ యాంకర్, టెలివిజన్ హోస్ట్‌గా ఫుల్‌ బిజీగా ఉంటున్నాడు.2014లో వీరి పెళ్లి జరగ్గా 2019లో ఒక పాప పుట్టింది.ఐదేళ్ల తర్వాత బాబు పుట్టాడు.

కొడుకు పుట్టడానికి ముందు వీరు ఉదకశాంతి పూజ చేయించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube