శ్రీ సత్య సాయి జిల్లా ప్రముఖ శిల్పకళా క్షేత్రమైన లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో పరంపర సంస్థ నృత్య కళాకారులు నృత్య ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేసింది.ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభ్యర్థన మేరకు గుడి సంబరాలు కార్యక్రమాల్లో భాగంగా పరంపర సంస్థ కళాకారులను నృత్య ప్రదర్శన లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం ముందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర( vasundhara ) ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.పరంపర సంస్థ కళాకారులు సాయంత్రం ఏడు గంటల నుండి ప్రారంభించగా రెండు గంటలపాటు నృత్య ప్రదర్శన కొనసాగింది.
లేపాక్షి మండల వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామ వాసులతో పాటు హిందూపురం నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నృత్య ప్రదర్శన తిలకించారు.నందమూరి వసుంధర కార్యక్రమాన్ని దగ్గరుండి వీక్షించారు.