వైసిపి( YCP ) పార్టీలో జగన్ తర్వాత గుర్తింపు ఉన్న అతి కొద్ది మంది నాయకులలో విడుదల రజనీ( Vidudala Rajini ) కూడా ఒకరిని చెప్పాలి.పబ్లిసిటీ పరంగా ఆమె తీసుకునే జాగ్రత్తల వల్లఆమె పేరు ఎప్పుడూ ప్రజల్లో వినపడుతూ ఉంటుంది .
మంత్రి పదవి కూడా దక్కిన తర్వాత ఆమె తన పనితీరుతో బలమైన నేతగా మారింది.మంత్రి పదవి తో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోకపోయినా విమర్శలు కూడా లేకుండా బాగానే బండి లాక్కొచ్చారు అని చెప్పాలి.
అయితే వచ్చే ఎన్నికలలో తన సీటుకు పోటీ వస్తారని అంచనాలు ఉన్న మరి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో ఇక తనకు రూట్ క్లియర్ అయిపోయింది అన్న ఆనందంలో ఉన్న ఆమెకు ఇప్పుడు షాక్ ఇచ్చే వార్తలు వస్తున్నాయి.గత ఎన్నికలలో టిడిపి నుంచి తన సమీప ప్రత్యర్థి అయిన ప్రత్తిపాటి పుల్లారావు మీద గెలిచిన ఆమె, ఈసారి కూడా ఆయనే తన ప్రత్యర్థి అని ప్రిపేర్ అయ్యారు.తన మంత్రి పదవి సహకారం తో తన బలాన్ని పెంచుకొని,

నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడం ద్వారా ప్రత్తిపాటి పుల్లారావును( Prattipati Pullarao ) ఓడించడం అంత కష్టం కాదనే ఆమె ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు అయితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు కాదని నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కి( Nandamuri Suhasini ) ఈ సీటు కేటాయిస్తారు అన్న వార్తలు ఆమెను కలవర పడుతున్నాయి.ఇప్పటికే ఈ విషయం లో నందమూరి బాలకృష్ణ చంద్రబాబు దగ్గర నుంచి హామీ తీసుకున్నారు అని పుల్లారావు కి ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని సముదాయించారని సమాచారం.ఇప్పటికే పెరిగిన వ్యతిరేకత కి తోడు నందమూరి కుటుంబ సభ్యురాలు ప్రత్యర్థి అయితే ఆమె గట్టేకడం కష్టమని అంచనాలు వినిపిస్తున్నాయి

ఈ నియోజకవర్గంలో కమ్మ ఓట్లు అత్యంత ప్రభావం చూపిస్తాయని, ఇప్పటివరకు అక్కడ కమ్మ అభ్యర్థులు మాత్రమే గెలుస్తూ వచ్చారని, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రజని జగన్ వేవ్ తోనే అక్కడ గెలవగలిగారని మరొకసారి అక్కడ గెలవడం ఆమెకు కష్టమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అయితే సుహాసిని అభ్యర్థిత్వాన్ని ఇప్పుడే కన్ఫామ్ చేయ్యరనీ ఎన్నికలకు ముందుగా ప్రకటిస్తారని అంటున్నారు .మరి అదే నిజమైతే రజనికి గట్టి పోటీ తప్పక పోవచ్చు .