ఒకప్పటి ఈ తెలుగు హీరో జూ. ఎన్టీఆర్ బాబాయ్ అని మీకు తెలుసా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన “లంకేశ్వరుడు” అనే చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు నెలకొల్పిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించగా తమిళ  సీనియర్ నటి రాధా హీరోయిన్ గా నటించింది.

 Nandamuri Kalyan Chakravarthy Family Relationship News,  nandamuri Kalyan Chak-TeluguStop.com

  అలాగే తెలుగు సీనియర్ హీరోయిన్ గాయత్రి నందమూరి కళ్యాణ్ చక్రవర్తి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రంలో హీరో మెగాస్టార్ చిరంజీవి బావమరిది పాత్రలో నటించిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కుటుంబం గురించి చాలా మందికి తెలియదు.

 అయితే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ప్రముఖ స్వర్గీయ నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు కు స్వయానా తమ్ముడు కొడుకు అవుతాడు. కళ్యాణ్ చక్రవర్తి తండ్రి త్రివిక్రమరావు కూడా తెలుగులో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు.

 కానీ చివరి రోజులలో ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడం అతనిని చూసుకునేందుకు కళ్యాణ్ చక్రవర్తి తన సినీ జీవితాన్ని కూడా త్యాగం చేశాడు.కానీ ఒకప్పుడు కళ్యాణ్ చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ హీరో రాజశేఖర్ తదితర స్టార్ హీరోలకు సైతం తన చిత్రాలతో గట్టిపోటీని ఇచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నందమూరి కళ్యణ్ చక్రవర్తి తమిళనాడులోని చెన్నై లో నివాసముంటున్నట్లు సమాచారం.అలాగే తన కొడుకుని హీరోగా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube