వీరసింహారెడ్డి కంటే వారసుడే ఎక్కువ.. నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారా?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సినిమాల థియేటర్ల విషయంలో ఏ స్థాయిలో చర్చ జరిగిందో అందరికీ తెలిసిందే.వారసుడు సినిమాకు దిల్ రాజు ప్రాధాన్యతనిస్తూ ఇతర సినిమాలకు అన్యాయం చేస్తున్నారని అభిప్రాయాలు వినిపించాయి.

 Nandamuri Fans Hurted Because Of Veerasimhareddy Movie Theatres Details Here Goe-TeluguStop.com

అయితే సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి సినిమాకు, వాల్తేరు వీరయ్య సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే.వారసుడు సినిమా కూడా ఈ రెండు సినిమాలకు ధీటుగా థియేటర్లలో విడుదలైంది.

క్రేజ్ ఉన్న థియేటర్లలో వారసుడు సినిమాను రిలీజ్ చేయడంతో పాటు వీరసింహారెడ్డి కంటే ఎక్కువ థియేటర్లలో వారసుడు సినిమా ప్రదర్శితమవుతోందని తెలుస్తోంది.ఈ విధంగా చేయడం వల్ల వీరసింహారెడ్డి సినిమాకు అన్యాయం జరుగుతోందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

కొంతమంది ఫ్యాన్స్ థియేటర్ల విషయంలో జరుగుతున్న అన్యాయం వల్ల తాము హర్ట్ అయ్యామని చెబుతున్నారు.

Telugu Balakrishna, Dil Raju, Nandamuri Fans, Tollywood, Varasudu, Vijay-Movie

హైదరాబాద్ లో వారసుడు 300 కంటే ఎక్కువ షోలు ప్రదర్శితమవుతుండగా వీరసింహారెడ్డి కేవలం 270 షోలు ప్రదర్శితమవుతోందని తెలుస్తోంది.బాలయ్య అభిమాన సంఘాల నాయకులు సైతం ఈ విషయంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.విజయవాడ లాంటి ప్రాంతాలలో క్రేజ్ ఉన్న థియేటర్లలో వీరసింహారెడ్డి సినిమాను ప్రదర్శించడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Balakrishna, Dil Raju, Nandamuri Fans, Tollywood, Varasudu, Vijay-Movie

ఈ కామెంట్ల విషయంలో దిల్ రాజు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతుండటం కూడా హాట్ టాపిక్ అవుతోంది.ఈ సినిమా థియేటర్లకు సంబంధించి బాలయ్య జోక్యం చేసుకుంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.వీరసింహారెడ్డికి మంచి థియేటర్లను కేటాయిస్తే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

మైత్రీ నిర్మాతలకు సంక్రాంతికి తమ బ్యానర్ నుంచి విడుదలైన సినిమాలు మంచి లాభాలను అందించాయి.ఈ సినిమాలు భారీగా కలెక్షన్లు సాధించడంతో పాటు నైజాంలో మైత్రీ బ్రాండ్ విలువను మరింత పెంచాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube