నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా యొక్క విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ ఆ రంగారావు ఈ రంగారావు… అక్కినేని తొక్కినేని అంటూ నోరు జారిన విషయం తెలిసిందే.బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు అన్నాడని ఏ ఒక్కరు కూడా భావించరు, కానీ ఆయన మాటలు కొందరిని బాధ పెట్టాయి.
అక్కినేని ఫ్యామిలీ కి చెందిన నాగ చైతన్య మరియు అఖిల్ వెంటనే స్పందించారు.అక్కినేని నాగేశ్వర రావు గొప్ప వ్యక్తి ఆయన గురించి తప్పుగా మాట్లాడొద్దు, గొప్పగా మాట్లాడాలి అన్నట్లుగా పరోక్షంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై మండి పడ్డారు.

అందులో బాలకృష్ణ పేరును ప్రస్తావించకున్నా కూడా అక్కినేని హీరోలు ప్రస్తావించింది కచ్చితంగా బాలకృష్ణ గురించే అనేది అందరికీ తెలిసిందే.అయితే బాలకృష్ణ అభిమానులు మరియు ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు మాత్రం ఇంత స్పీడ్ గా అక్కినేని హీరోలు స్పందించాల్సిన అవసరం లేదని బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు అని ఉండడు అని భావించాల్సిందని అంటున్నారు.
కాస్త సమయం ఇచ్చి బాలకృష్ణ వివరణ తీసుకున్న తర్వాత అక్కినేని హీరోల నుండి స్పందన వస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.సోషల్ మీడియా లో ఇప్పటికే అక్కినేని మరియు నందమూరి అభిమానుల మధ్య గొడవ జరుగుతుంది ఆ గొడవ కు అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఆజ్యం పోసినట్లుగా ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది.

బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా కచ్చితంగా అని ఉండడు.ఎందుకంటే ఆయన చిన్న పిల్లాడు మనస్తత్వం.సినిమా విజయోత్సవ ఉత్సాహం తో కాస్త అతిగా మాట్లాడి ఉంటాడు.తప్పితే ఉద్దేశపూర్వకంగా కచ్చితంగా బాలకృష్ణ మాట్లాడలేదు అనేది చాలా మంది అభిప్రాయం.అక్కినేని హీరోలు కాస్త ఓపిక తో ఉండాల్సింది అనేది కొందరి అభిప్రాయం.బాలయ్య ఫ్యాన్స్ ఈ విషయంలో అక్కినేని హీరోలను కొందరు విమర్శిస్తున్నారు.







