టాలీవుడ్ నందమూరి నటుడు చైతన్య కృష్ణ ( Chaitanya Krishna )తాజాగా నటించిన చిత్రం బ్రీత్( Breathe ) .ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన విషయం తెలిసిందే.
సైకలాజికల్ థ్రిల్లర్ కి కనీస ఆదరణ దక్కలేదు బ్రీత్ జీరో షేర్ రాబట్టి దారుణమైన పరాజయం మూట గట్టుకుంది.కనీసం నందమూరి అభిమానులు కూడా ఈ చిత్రాన్ని చూడలేదు.
బ్రీత్ విడుదలై చాలా కాలం అవుతుంది.అయినా ఓటీటీలోకి( OTT ) రాలేదు.
ఎట్టకేలకు ఆహాలో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది.ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
మార్చి 8 నుండి బ్రీత్ ఆహాలో స్ట్రీమ్ కానుంది.

బ్రీత్ చిత్రానికి వంశీ ఆకెళ్ళ ( Vamsi akella )దర్శకుడు.చైతన్య కృష్ణ తండ్రిగారైన జయకృష్ణ( Jayakrishna ) స్వయంగా నిర్మించారు.బ్రీత్ కథ విషయానికి వస్తే.
రాష్ట్ర సీఎం ని కొందరు చంపాలని చూస్తారు.ఒక సామాన్యుడు సీఎం ని ఎలా కాపాడాడు అనేదే కథ.చైతన్య కృష్ణ బ్రీత్ చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేశాడు.బాలకృష్ణ కూడా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.
అయినా మూవీని ఎవరు పట్టించుకోలేదు.దాంతో దారుణమైన రికార్డు సొంతం చేసుకుంది.
థియేటర్స్ లో బ్రీత్ సినిమాకు ఆదరణ దక్కలేదు.మరి ఓటీటీలో ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి మరి.

కాగా భారీ అంచనాలను నడుమ థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన బ్రీథ్ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.ముఖ్యంగా నందమూరి అభిమానులను ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది.మరి ఈ సినిమాము ఓటీటీ ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి మరి.బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై చైతన్యకృష్ణ తండ్రి జయకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.వంశీకృష్ణ ఆకెళ్ల సినిమాకి దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో వైదిక సెంజలియా హీరోయిన్‌గా నటించింది.మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు.