బాలయ్య కోసం బాలీవుడ్ బ్యూటీ

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం రూలర్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 Nandamuri Balakrishna To Romance Bollywood Beauty-TeluguStop.com

తమిళ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.కాగా బాలయ్య తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇటీవల ప్రారంభించాడు.

ఇక ఈ సినిమాలో బాలయ్య మునుపెన్నడు కనిపించని పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ బాలీవుడ్ స్టార్ బ్యూటీని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.బాలీవుడ్‌లో తన అందాలతో పాటు నటనతోనూ ఇంప్రెస్ చేసిన సోనాక్షి సిన్హాను బాలయ్య సరసన నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీనికి సంబంధించి ఆమెతో చర్చలు కూడా జరిపారట చిత్ర యూనిట్.

బాలయ్య లాంటి పవర్‌ఫుల్ యాక్టర్ పక్కన సోనాక్షి అయితే సూపర్ కాంబినేషన్ అవుతుందని బోయపాటి ప్లాన్.

అటు సోనాక్షికి ఈ సినిమా కోసం భారీగా ముట్టచెప్పనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆమె ఈ సినిమాను ఒప్పుకుంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఏదేమైనా బాలయ్య కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను రంగంలోకి దించేందుకు బోయపాటి చాలా కష్టపడుతున్నాడట.

దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube