శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హ్యాట్రిక్ కొట్టారు.ఈ మేరకు వరుసగా మూడో సారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఈ క్రమంలో సమీప అభ్యర్థి కోడూరి దీపికపై సుమారు 20 వేల ఓట్లకు పైగా మెజార్టీతో బాలకృష్ణ విజయం సాధించారు.దీంతో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని మరోసారి నిరూపితమైంది.
గతంలో దివంగత నేత ఎన్టీఆర్ సైతం ఈ స్థానం నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.