కూతురు కోసం జైలుకు వెళ్లనున్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) తన కూతురు కోసం జైలుకు వెళ్లనున్నాడట, చెయ్యని నేరాన్ని తన నెత్తి మీద వేసుకొని కూతురు జీవితం కలకాలం సుఖం గా ఉండేందుకు బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఉదయం నుండి ఈ వార్త సోషల్ మీడియా (Social Media )లో ఒక రేంజ్ లో ప్రచారం అవుతూ నందమూరి అభిమానులను కలవర పెడుతుంది.

 Nandamuri Balakrishna Bhagavanth Kesari Movie Update , Social Media, Anil Ravip-TeluguStop.com

అయితే బాలయ్య జైలుకు వెళ్తుంది రియల్ లైఫ్ కూతురు కోసం కాదు, రీల్ లైఫ్ కూతురు కోసం.ఇక అసలు విషయం లోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి ఒక సినిమా చేస్తున్న సం )గతి తెలిసిందే.ఈ సినిమాకి ‘భగవత్ కేసరి( Bhagavanth Kesari ‘ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.‘ఐ డోంట్ కేర్’ అనేది క్యాప్షన్.ఈ చిత్రం లో బాలయ్య తెలంగాణ స్లాంగ్ ని ఉపయోగించబోతున్నాడు, ఇందులో బాలయ్య కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, శ్రీలీల( Sreeleela )బాలయ్య కి కూతురుగా నటిస్తుంది.

Telugu Anil Ravipudi, Sreeleela, Tollywood-Movie

ఈ చిత్రం లో బాలయ్య తన కూతురు కోసం చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకొని 20 ఏళ్ళు జైలు జీవితాన్ని గడిపి వస్తాడట.సినిమా మొత్తం బాలయ్య మార్కు మాస్ సన్నివేశాలు మరియు ఎలివేషన్స్ ఉంటాయి కానీ, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ని మాత్రం ఆశించొద్దు అని అంటున్నారు ఈ సినిమాలో పని చేస్తున్న కొంతమంది యూనిట్ సభ్యులు.అనిల్ రావిపూడి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బ్రాండ్ ఇమేజి ఉంది.

ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలన్నీ కామెడీని ప్రధాన అంశంగా తీసుకొని తెరకెక్కించినవే.మొట్టమొదటి సారి ఆయన తన స్ట్రాంగ్ జోన్ ని వదిలి బయటకి వచ్చి ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు చేస్తున్నాడు.

మరి బాలయ్య మాస్ ని అనిల్ రావిపూడి హ్యాండిల్ చేయగలడా, తనకి తెలియని జానర్ లో సక్సెస్ కాగలదా?, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే.

Telugu Anil Ravipudi, Sreeleela, Tollywood-Movie

ఇక జూన్ 10 వ తారీఖున బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతుంది మూవీ టీం.ఈ టీజర్ లో బాలయ్య మార్కు డైలాగ్స్ మరియు పవర్ ఫుల్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయట.ఇన్నేళ్ల బాలయ్య కెరీర్ లో ఎప్పుడూ కూడా తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పలేదు, అందువల్ల ఈ సినిమాలో బాలయ్య బాబు తెలంగాణ స్లాంగ్ ఎలా ఉంటుందో విందాం అని కేవలం బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్య తోటి స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున మరియు వెంకటేష్ ఇది వరకే చాలా సినిమాలలో తెలంగాణ స్లాంగ్ ని వాడారు.ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది, రీసెంట్ గా తెలంగాణ స్లాంగ్ తో తెరకెక్కిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి, మరి ‘భగవత్ కేసరి’ చిత్రం కూడా హిట్ అవుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube