మరోసారి హ్యాట్రిక్ హిట్ కాంబో.. బాలయ్య ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్!

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా అఖండ.ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 2న విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.వీరిద్దరి కాంబోలో ఇంతకు ముందే రెండు సినిమాలు వచ్చాయి.ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ సినిమాలే.సింహ, లెజెండ్ సినిమాలు వీరిద్దరి కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

 Nandamuri Balakrishna Again Movie With Boyapati Details, Nbk107 , Boyapati Srinu-TeluguStop.com

బోయపాటి బాలయ్య సినిమా చేసినప్పుడల్లా ఆయనను ప్లాప్స్ నుండి బయట పడేసేవారు.

ఇక అఖండ సినిమా హిట్ అయ్యే వరకు కూడా బాలయ్య వరుస ప్లాప్స్ అందుకున్నాడు.ఇక ఆ సినిమాల తర్వాత మరోసారి అఖండ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు.

 Nandamuri Balakrishna Again Movie With Boyapati Details, NBK107 , Boyapati Srinu-TeluguStop.com

ఇక హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వీరి కాంబో మరోసారి రాబోతుంది అనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి.తాజాగా ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుండడంతో నిజంగానే మరో సినిమా రాబోతుంది అని అంతా ఫిక్స్ అవుతున్నారు.

Telugu Anil Ravipudi, Boyapati Srinu, Nbk-Movie

బాలయ్య, బోయపాటి ఫ్యాన్స్ కు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట.ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా తెరపైకి తెస్తున్నట్టు టాక్.బాలయ్య పొలిటికల్ మూవీ బోయపాటితోనే బాగుంటుంది అని భావించి ఈయనకు మరో అవకాశం ఇచ్చారట.2023 మధ్యలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించి 2024 ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు అని తెలుస్తుంది.ఈ పొలిటికల్ డ్రామాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.ఇక ప్రెజెంట్ బాలకృష్ణ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేసున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత తన 108 సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube