నమ్రతా శిరోద్కర్.మహేష్ బాబు భార్య కాక ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే.
మిస్ ఇండియా గా నిలిచిన నమ్రతా శిరోద్కర్ తెలుగులో మహేష్ బాబు తో సినిమా చేస్తున్న సందర్భంగా ఆయనతో ప్రేమలో పడింది.ఇద్దరి మధ్య ప్రేమ చాలా దూరం వరకు వెళ్లింది.
ఇతర స్టార్స్ ప్రేమ మాదిరిగా కొన్నాళ్లు సాగి విడిపోలేదు.వీరిదరిది చాలా స్ట్రాంగ్ బంధం అని పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సుదీర్ఘ కాలం పాటు వీరిద్దరూ ఆప్యాయంగా కొనసాగారు.కొనసాగుతూనే ఉన్నారు.
మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన నమ్రతా శిరోద్కర్ ఆ తర్వాత ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించింది.
సూపర్ స్టార్ భార్య అయిన నమ్రతా శిరోద్కర్ నటించడం వల్ల అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాక చాలా వరకు ఆమె నటించేందుకు నో చెప్పిందట, ఆమెకు ఆసక్తి ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఆమె అవసరం ఉన్నప్పటికీ సమాజం కోసం సినిమాల్లో నటించకుండా దూరంగా ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో వరుసగా తన అందమైన ఫోటో షూట్స్ ని షేర్ చేస్తూ వస్తున్నారు.ఈమె షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ గా కాకుండా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా నమ్రతా శిరోద్కర్ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవలే రవితేజ హీరో గా నటిస్తున్న సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు ఓకే చెప్పింది.
తెలుగులో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో నమ్రత కూడా రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.మరి ఆమె అందుకు ఓకే చెప్తుందా లేదా అనేది చూడాలి.
ఇలా అందమైన ఫోటో షూట్స్ షేర్ చేస్తున్న సందర్భంలో చాలా మంది సెకండ్ ఇన్నింగ్స్ కి నమ్రత సిద్ధమవుతుందా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు వారి ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి.