టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి కొత్త పోరాటానికి శ్రీకారం చుట్టారు.వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఆయన కుమార్తె సునీతా చేస్తున్న న్యాయ పోరాటం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెకు మద్ధతు తెలుపుతున్నట్లు ప్రకటించిన ఆనం.సోషల్ మీడియా వేదికగా జస్టిస్ ఫర్ సునీత పేరిట పోరాటాన్ని మొదలుపెట్టారు.మీరు కూడా మద్థదు తెలపాలంటూ ఓ ఫొటోను విడుదల చేశారు.అందులో వివేకానందరెడ్డి బ్యాక్ డ్రాప్‌గా ఓ వైపున సునీత, మరోవైపున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలను జత చేశారు.
ఆ ఫొటోకు జత చేసిన తన కామెంట్ కింద #జస్టిస్ ఫర్ సునీత అని ఆయన పేర్కొన్నారు.







