మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మోస్ట్ అందగాడు ఎవరు అంటే వినిపించే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈయన ఫాలోయిన్ నే వేరు.
సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.ఇక ఇప్పుడు ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
థియేటర్స్ లోకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.కలెక్షన్స్ కూడా అదరగొడుతూ ముందుకు వెళుతున్నాడు సూపర్ స్టార్.
అయితే గత కొన్ని రోజులుగా మహేష్ ప్రతి సినిమాను గమనిస్తే హీరోయిన్ ను మారుస్తూ వస్తున్నాడు.ఈయన హీరోయిన్లను రిపీట్ చెయ్యడం చాలా అరుదుగా జరుగుతుంది.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో సమంత ను రిపీట్ చేసిన తర్వాత ఈయన వరుసగా తమన్నా, కృతి సనన్, శృతి హాసన్, రకుల్ ప్రీత్, కియారా, పూజా, రష్మిక, ఇప్పుడు కీర్తి లతో సినిమాలు చేసాడు.అయితే మహేష్ బాబు తో కెరీర్ స్టార్ట్ చేసిన భామలకు మాత్రం కాలం కలిసి రాలేదు.
మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసిన వారికీ ఇక్కడ కాలం కలిసి రాలేదనే చెప్పాలి.మరి ఆ 6 మంది హీరోయిన్స్ ఎవరో చూద్దాం.
నమ్రత శిరోద్కర్ : మహేష్ బాబు వంశీ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత మెగాస్టార్ తో చేసిన అంజి సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఇక ఆ తర్వాత ఈమెకు ఛాన్సులు రాలేదు.అయితే ఈమె మహేష్ ను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయ్యింది.
బిపాసా బసు లీసారే : వీరిద్దరూ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్.అప్పట్లో వీరు చేసిన టక్కరిదొంగ సినిమా ప్లాప్ అవ్వడంతో వీరిని ఎవ్వరు అంతగా పట్టించు కోలేదు.దీంతో ఇక్కడ ఛాన్సులు రాలేదు.
కృతి సనన్ : వన్ నేనొక్కడినే తో ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఆ తర్వాత నాగ చైతన్య దోచేయ్ సినిమాలో నటించిన ప్లాప్ అవడంతో ఈమెకు అవకాశాలు రాలేదు.
కియారా అద్వానీ : భరత్ అనే నేను సినిమాతో తెలుగులో అడుగు పెట్టి హిట్ అయితే కొట్టింది.కానీ వినయ విధేయ రామ సినిమాతో ప్లాప్ రావడంతో ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు.అయితే ఇప్పుడు మరోసారి చరణ్ కు జోడీగా ఆర్సీ 15 లో అవకాశం వచ్చింది.
అమృతరావు : మహేష్ హీరోగా వచ్చిన అతిథి సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా ప్లాప్ అవవడంతో ఈమెను అస్సలు అవకాశాలు వరించలేదు.