నమ్రత త్రోబ్యాక్ ఫోటో.. షారుఖ్ ఖాన్, సంజూ భాయ్ లతో పిక్చర్!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ఆయన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న మహేష్ బాబు స్టార్ హీరోగా నిలిచాడు.

 Namrata Shirodkar Shares Throwback Picture With Shah Rukh Khan, Gauri, Sangeeta Bijlani,gauri Khan,shah Rukh Khan, Mahesh Babu,namrata Shirodkar-TeluguStop.com

ఇక ఈయన భార్య నమ్రత గురించి అందరికీ పరిచయమే.ఈమె కూడా ఇండస్ట్రీకి చెందిన నటి.తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది.

మహేష్ బాబు నమ్రత కలిసి ఓ సినిమాలో కూడా నటించగా ఆ సమయంలో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.

 Namrata Shirodkar Shares Throwback Picture With Shah Rukh Khan, Gauri, Sangeeta Bijlani,Gauri Khan,Shah Rukh Khan, Mahesh Babu,Namrata Shirodkar-నమ్రత త్రోబ్యాక్ ఫోటో.. షారుఖ్ ఖాన్, సంజూ భాయ్ లతో పిక్చర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక 2005లో పెళ్లి చేసుకోగా వీరికి గౌతమ్ కృష్ణ, సితార అనే పిల్లలు ఉన్నారు.ఇక నమ్రత పెళ్లి పిల్లల తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండి.

పిల్లల గురించి బాగా శ్రద్ధ తీసుకుంటుంది.అంతేకాకుండా కొన్ని బిజినెస్ లు కూడా చూసుకుంటుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.తన పిల్లలకు సంబంధించిన విషయాలను, మహేష్ బాబుకు సంబంధించిన విషయాలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.నమ్రత తన పిల్లల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తుంది.అంతేకాకుండా వారి ఇష్టాయిష్టాలను కూడా బాగా గౌరవిస్తుంది.ఇక పిల్లల విషయంలో ఎప్పుడు చాలెంజింగ్ గా అనిపించలేదని పిల్లలు ఉంటే సరదాగా ఉంటుందని తెలిపింది.

నమ్రత ఒక తల్లి గానే కాకుండా మంచి భార్యగా కూడా దొరికిందని మహేష్ బాబు కూడా పలుమార్లు తెలిపాడు.

తను ఒక స్టార్ నటుడిగా, వ్యాపారంలో అగ్ర స్థాయి లో ఎదిగేలా చేయడంలో నమ్రత బాధ్యత ఉందని గతంలో తెలిపాడు మహేష్.కేవలం భార్య గానే కాకుండా మంచి స్నేహితురాలిగా ఉంటుందని ఆమె తన ప్రపంచమని తెలిపాడు.

మొత్తానికి నమ్రత ఇప్పుడు ఒక మంచి భార్యగా, మంచి తల్లిగా మాత్రమే కనిపిస్తుంది.కానీ ఈమె కూడా ఒకప్పుడు హాట్ బ్యూటీనే.కానీ పెళ్లి తర్వాతే తనకిష్టమైన సినిమా కెరియర్ ను కూడా వదిలేసి తన భర్త, పిల్లలతోనే తన జీవితం అన్నట్లుగా ఉంటుంది.ఇక మహేష్ బాబు ఫ్రీ టైం లో తన ఫ్యామిలీతో బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

ఇక ఆ ఫోటోలను కూడా నమ్రత అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా నమ్రత.త్రో బ్యాక్ ఫోటో ని షేర్ చేసుకుంది.బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, అతని భార్య గౌరీ, నటి సంగీత బిజ్లానీ లతో కలిసి ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.

ఇక మరో ఫోటో కూడా షేర్ చేయగా అందులో సంజయ్ దత్, అనన్య పాండే తండ్రి చుంకీ పాండే లు కూడా ఉన్నారు.

ఆ ఫోటోలను షేర్ చేసుకుంటూ.

తామంతా మెక్సికో క్రూయిజ్ లైనర్ లో కలుసుకున్నాము అని.ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ టైం అంటూ.గౌరీ నువ్వు ఇతర ఫోటోలలో మిస్ అవుతున్నావు.నా చేతికి లభించిన అదృష్టం.జ్ఞాపకాలను ఆస్వాదిస్తున్నారు అని కామెంట్ పెట్టింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube