ఆమె విదేశాల్లోని చేస్తోన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగంతో లక్షల్లో గడిస్తోంది.అయినా ఆమె ఆ ఉద్యోగాన్ని తృణపాయంగా వదిలేసి స్వయంగా వ్యవసాయ అనుబంధ రంగంలోకి అడుగుపెట్టింది.
కట్ చేస్తే ఇప్పుడు ఆమె ఓ బ్రాండ్ ప్రొడక్ట్‌కి యజమానురాలిగా మారింది.అవును, తేనె టీగలకు ఆయా కాలాల్లో లభించే పూలను బట్టి తేనే రంగు రుచిలో తేడాలు అనేవి వస్తుంటాయి.
కాని మనకు మార్కెట్లో దొరికే ప్రముఖ కంపెనీల బ్రాండ్లు తేనే ఏ కాలాల్లో అయినా ఒకే రకంగా ఉంటోంది.దీనికి కారణం బెల్లం, పంచదారతో తేనెను కల్తీ చేయడమే.

అయితే ఆమె అలా చేయలేదు.నల్గొండ జిల్లాకు చెందిన అనూష నెలకు 600 కిలోల స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.ఇపుడు మార్కెట్లో లభించే తెనేలో 96 శాతం కంపెనీలు కల్తీవే.అందుకే ఆమె ప్రజలకు స్వచ్ఛమైన తేనె అందించాలని నిర్ణయించుకున్నారు.2019లో కరోనా సమయంలో తేనె ఉత్పత్తిపై జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ తీసుకుంది.తేనె పరిశ్రమను విజయవంతంగా నడపడంలో శిక్షణ ఎంతగానో ఆమెకి ఉపయోగపడింది.మొదట రూ.20 లక్షలతో తేనె ఉత్పత్తికి కావాల్సిన పెట్టెలను అనూష కొనుగోలు చేసి వివిధ కాలాల్లో వాటిని పలు ప్రాంతాలకు మారుస్తూ తేనె ఉత్పత్తి చేయడం ఆరంభించింది.

ప్రస్తుతం ఆమె తెలంగాణలోని వికారాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, యాచారం ఇలా అటవీ ప్రాంతాల్లో తేనె పెట్టెలను ఉంచడం ద్వారా నెలకు 600 కిలోల తేనె ఉత్పత్తి చేస్తోంది అంటే మీరు నమ్ముతారా? దాంతో ఆమె తేనె ఉత్పత్తి, విక్రయం ద్వారా నెలకు రూ.3 లక్షల వరకు సంపాధిస్తున్నారు.ఆమె కేవలం తేనె ఉత్పత్తి చేయడమే కాకుండా “బీ ప్రెష్ ప్యూర్ హనీ” పేరుతో ఓ బ్రాండు కూడా క్రియేట్ చేశారు.హైదరాబాద్ లోని వనస్థలిపురంలో తేనె ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు.
నగరంలో ఎక్కడికైనా ఉచితంగా డెలివరీ అందివ్వగా దూర ప్రాంతాలకు మాత్రం కొరియర్ ద్వారా తేనె పంపిస్తున్నారు.ఇలా ఏటా రూ.2 కోట్ల విలువైన తేనె ఉత్పత్తి చేస్తూ అనూష నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.







