Heroine Nagma: ఒకప్పుడు యాపిల్ బ్యూటీ.. ఇప్పుడు ఆ హీరోయిన్ ని చూస్తే షాక్ అవ్వాల్సిందే?

హీరోయిన్ నగ్మా.

ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియగా పోయినప్పటికీ 90 ల కాలంలో నగ్మా పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.

తన అందం అభినయంతో వీక్షకులను కట్టిపడేసింది.అంతేకాకుండా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది హీరోయిన్ నగ్మా.

అలా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.అప్పట్లో నగ్మా కిల్లర్, అల్లరి అల్లుడు, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, ప్రేమికుడు, వారసుడు, భాషా ఇలా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా అప్పట్లో చాలామంది అభిమానులు కేవలం నగ్మా కోసం సినిమా థియేటర్ కి వెళ్లేవారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే అప్పట్లో నగ్మా సినిమాల ద్వారానే కాకుండా ఎఫైర్ల విషయంలో కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

Advertisement

టీమిండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీతో కలిసి నగ్మా రిలేషన్షిప్ లో ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.అంతేకాకుండా వారిద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా నగ్మా కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.

తాజాగా హీరోయిన్ నగ్మా,తన చెల్లెలు, హీరోయిన్ జ్యోతిక, ఆమె భర్త సూర్యతో కలిసి ముంబైలోని ఒక హోటల్లో కనిపించింది.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే అప్పట్లో తెలుగు, తమిళం, హిందీ,మలయాళ,కన్నడ,, బెంగాలీ,మరాఠీ ఇలా అనేక భాషలో స్టార్ హీరోయిన్ గా నటించి ఒక వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.

ఒకప్పుడు యాపిల్ బ్యూటీ లా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త బొద్దుగా తయారయింది.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు