ఆ డైరెక్టర్ కెరియర్ ను నాశనం చేసిన నాగార్జున...

సినిమా ఇండస్ట్రీ( Film industry ) లో ఒక సినిమా హిట్ అయితే అందరూ ఆ హిట్ లో నా క్రెడిట్ కూడా ఉంది అన్నట్టు గా బిహేవ్ చేస్తారు అదే ఒక సినిమా ప్లాప్ అయితే నేను ముందే చెప్పాను డైరెక్టర్ కి వినలేదు అని తప్పంతా డైరెక్టర్ దే అన్నట్లు గా సృష్టిస్తారు…అయితే ఇదంతా ఎందుకు చెప్తున్న అంటే అప్పుడెప్పుడో నాగార్జున హీరోగా( Hero Nagarjuna ) నటించిన భాయ్ సినిమా( Bhai movie ) పరిస్థితి సేమ్ ఇలాగే అయింది…ఈ సినిమా కి వీరభద్రం చౌదరి డైరెక్టర్ ఆయన అప్పటికే అల్లరి నరేష్ తో అహ నా పెళ్ళంట అనే సినిమా తీసి సక్సెస్ సాధించాడు.అలాగే సునీల్ తో పుల రంగడు అనే సినిమా తో వరుసగా రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు…ఈ సినిమాని కూడా యాక్షన్‌ కామెడీగా రూపొందించాడు, ఈ సినిమాలో రీచా గంగోపాధ్యాయ హీరోయిన్‌గా( Richa Gangopadhyay as the heroine ) నటించిన విషయం తెలిసిందే.

 Nagarjuna Who Destroyed That Director Career Details, Veerabhadram Chowdary,naga-TeluguStop.com

భారీ అంచనాల నడుమ 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరమైన డిజాస్టర్ అయింది.ఈ సినిమాతో దర్శకుడు వీరభద్రం చౌదరికి పెద్ద దెబ్బ పడింది అని చెప్పవచ్చు.నాగార్జున కూడా తాను బాగానే చేశానని, తన మిస్టేక్‌ ఏం లేదనట్టుగా అప్పట్లో చెప్పడంతో ఈ సినిమా ఫ్లాప్‌కి కారణంగా దర్శకుడే అనే సందేశం వెళ్లిపోయింది…

Telugu Bhai, Nagarjuna-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వీరభద్రం చౌదరి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ హీరో నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.భాయ్‌ సినిమాతో నా కెరీర్‌ ఆగిపోయింది.నా మొదటి సినిమా ఆహానా పెళ్లంట సూపర్‌ హిట్‌ అయ్యింది.ఆ తర్వాత పూలరంగడు మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్ అయింది.హాయిగా సాగిపోతున్న జీవితంలో భాయ్‌ పెద్ద బ్రేక్‌ వేసిందని, ఫ్లైట్‌లో వెళ్తున్న వాళ్లని మధ్యలో ఒక్కసారిగా తోసేస్తే ఎలా అయితే ఉంటుందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది అని తెలిపారు వీరభద్రం చౌదరి మొదట నేను ఈ సినిమా కథని కామెడీ ఎంటర్‌టైనర్‌ గా చేయాలనుకున్నాను…

 Nagarjuna Who Destroyed That Director Career Details, Veerabhadram Chowdary,Naga-TeluguStop.com

Telugu Bhai, Nagarjuna-Movie

హిలేరియస్‌ కథనే చేశానని, కానీ నాగార్జున హీరో అనేసరికి రకరకాల డెవలప్‌మెంట్ల కారణంగా సీరియస్‌గా మారిపోయిందన్నారు.ఫస్ట్ నేను చెప్పిన భాయ్‌ కథ సరదాగా, జోవియల్‌గా ఉంటుందని, కామెడీగా సాగుతూ చివర్లో సీరియస్‌గా మారుతుందని, ఎప్పుడైతే నాగార్జున హీరో అనుకున్నామో, ఆ తర్వాత డెవలప్‌మెంట్ కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గిపోతూ వచ్చింది.పూర్తి సీరియస్‌గా మారిపోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చౌదరి.

ఆడియెన్స్ కామెడీ ఉంటుందని ఆశించారు, కానీ సీరియస్‌గా సాగడంతో వారికి రీచ్‌ కాలేదు.దీంతో ఘోరంగా పరాజయం పాలయింది అని చెప్పుకొచ్చారు చౌదరి.

కాగా ఈ మూవీ డిజాస్టర్ పై నాగార్జున స్పందిస్తూ ఇందులో తన తప్పేం లేదని ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేశారనే ప్రశ్నకి వీరభద్రం చౌదరి రియాక్ట్ అవుతూ, తప్పు జరిగింది…

సినిమా ఫ్లాప్‌ అయ్యింది.దానిపై ఇప్పుడేం మాట్లాడలేం.

తప్పు ఏ రూపంలో జరిగినా తప్పే, దానిపై ఒకరిపై నెట్టలేమన్నారు.ఒక సినిమా ఆడినా, ఆడకపోయినా డైరెక్టరే బాధ్యుడని నిందని తనపై వేసుకున్నారు చౌదరి.

అలా మొత్తానికి నాగార్జున వల్ల తన కెరియర్ నాశనం అయ్యింది అని వీరభద్రం చౌదరి చెప్పకనే చెప్పేశారు.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అక్కినేని హీరోలకి వీరభద్రం చౌదరి డైరెక్టర్ ఉసిరి తగిలింది అందుకే ఆ హీరోలు వరుసగా ఫ్లాప్స్ ని ఎదుర్కొంటున్నారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube