నా కొడుకు పెళ్లి వేడుక మాత్రమే కాదు... అద్భుతమైన జ్ఞాపకం: నాగార్జున

నాగచైతన్య( Nagachaitanya ) శోభిత ( Sobhita )!వివాహం పూర్తి కావడంతో ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ( Nagarjuna ) సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.శోభిత మా జీవితాలలోకి సంతోషాన్ని తీసుకోవచ్చిందని, వీరి వివాహం నాన్నగారి విగ్రహం నందు జరగడం చాలా ప్రత్యేకం అంటూ నాగచైతన్య శోభిత  పెళ్లి గురించి నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

 Nagarjuna Special Thanks To Media , Nagarjuna, Nagachaitanya, Sobhita, Media-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఈయన మరొక ఫోటోని కూడా షేర్ చేస్తే వీరి పెళ్లి గురించి మరొక పోస్ట్ చేశారు.

Telugu Nagachaitanya, Nagarjuna, Sobhita-Movie

ఈ సందర్భంగా మీడియా వారికి ఈయన కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.మీడియా సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

మమ్మల్ని అర్థం చేసుకొని మా ఈ అందమైన క్షణాన్ని మేము మరింత మధురంగా జరుపుకోవడానికి స్పేస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.మీ ఆలోచనలు మీరు మాపై చూపించిన గౌరవం, మీరు మాకు తెలియజేసిన శుభాకాంక్షలు మా ఆనందాన్ని మరింత రెట్టింపు చేశాయి.

మా ప్రియమైన స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు అభిమానులకు మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలు నిజంగా ఈ సందర్భాన్ని మరువలేని తెలిపారు.

Telugu Nagachaitanya, Nagarjuna, Sobhita-Movie

నా కొడుకు పెళ్లి కేవలం కుటుంబ వేడుక మాత్రమే కాదు.మీరు అందరూ మాతో పంచుకున్న ప్రేమ, అభిమానం మద్దతు కారణంగా ఇది ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మారింది.మీరు మాకు చూపించిన లెక్కలేని అభిమానానికి అక్కినేని కుటుంబ సభ్యుల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంటూ మీడియా వారిని ఉద్దేశించి చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతున్నాయి.

ఇక నాగచైతన్య పెళ్లి జరగడంతో త్వరలోనే అఖిల్ పెళ్లి కూడా జరగబోతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube